తెలంగాణ

telangana

ETV Bharat / sports

కివీస్​తో పోరుకు భారత్ ​సై.. మరి గత రికార్డులను తిరగరాస్తుందా..!

మరి కాసేపట్లో కిివీస్​ సేనతో భారత్​ పోటీపడనుంది. ఇప్పటికే ఉప్పల్​ వేదికకు అభిమానులు హోరెత్తుతున్నారు. ఉత్కంఠంగా జరిగే ఆ మ్యాచ్​ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రెండు జట్ల కలయిక ఇది మొదటి సారి కాదు. మరీ వీరు తిరగరాసిన రికార్డుల గురించి ఓసారి తెలుసుకుందామా.

india vs newzealand match
india vs newzealand match

By

Published : Jan 18, 2023, 10:55 AM IST

Updated : Jan 18, 2023, 11:18 AM IST

శ్రీలంకపై టీ20 సిరీస్‌లో 2-1 తేడాతో, వన్డే సిరీస్‌లో 3-0 తేడాతో విజయాన్ని సొంతం చేసుకుని మంచి జోష్‌ మీదున్న టీమ్‌ఇండియా.. ఇప్పుడు న్యూజిలాండ్‌తో సమరానికి సై అంటోంది. ఇటు న్యూజిలాండ్‌ కూడా పాకిస్థాన్‌పై మూడు వన్డేల సిరీస్‌ని 2-1 తేడాతో కైవసం చేసుకుని జోరుమీదుంది. ఈ క్రమంలో భారత్‌, కివీస్ మధ్య పోరు మరికాసేపటిలో ప్రారంభంకానుంది. వన్డే సిరీస్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారథ్యం వహిస్తున్నాడు. మరి ఏ మ్యాచ్‌.. ఎప్పుడు, ఎక్కడ జరగనుంది, ఎలా వీక్షించాలి, ఇరుజట్ల మధ్య గత రికార్డులు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం.

వన్డే సిరీస్ షెడ్యూల్‌

  • తొలి వన్డే- జనవరి 18.. వేదిక: హైదరాబాద్‌ (మధ్యాహ్నం 1.30 గంటలకు)
  • రెండో వన్డే- జనవరి 21.. వేదిక: రాయ్‌పూర్ (మధ్యాహ్నం 1.30 గంటలకు)
  • మూడో వన్డే- జనవరి 24.. వేదిక: ఇందౌర్‌ (మధ్యాహ్నం 1.30 గంటలకు)

ఎలా చూడాలి?
ఈ రెండు సిరీస్‌లకు సంబంధించిన మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ లైవ్‌ టెలికాస్ట్ చేస్తుంది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో వీక్షించొచ్చు.

గత రికార్డులు ఇలా..
వన్డేల్లో న్యూజిలాండ్‌పై టీమ్‌ఇండియాకు మంచి రికార్డే ఉంది. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 113 మ్యాచ్‌లు జరిగ్గా.. 55 మ్యాచ్‌ల్లో భారత్‌ జయకేతనం ఎగురవేయగా.. 50 మ్యాచ్‌ల్లో కివీస్‌ విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ టై కాగా.. ఏడింటిలో ఫలితం తేలలేదు. టీ20ల్లోనూ భారతే ఆధిపత్యం కొనసాగిస్తోంది. 22 మ్యాచ్‌లు జరగ్గా.. భారత్‌ 12, న్యూజిలాండ్‌ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది.

వన్డేలకు భారత జట్టు:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్య (వైస్‌ కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎస్ భరత్, రజత్‌ పాటిదార్‌, వాషింగ్టన్‌ సుందర్, షాబాజ్‌ అహ్మద్‌,శార్దూల్ ఠాకూర్‌, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్‌ యాదవ్‌,మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌,ఉమ్రాన్‌ మాలిక్.

వన్డేలకు న్యూజిలాండ్‌ జట్టు:
టామ్ లాథమ్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, డగ్ బ్రేస్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, హెన్రీ సో షిప్లెన్, బ్లెయిర్ టిక్నర్.

ఇదీ చదవండి:

Last Updated : Jan 18, 2023, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details