Virat Kohli Covid: ఐదో టెస్టు ఆడేందుకు ఇంగ్లాండ్‌కు వెళ్లిన టీమ్‌ఇండియాను కరోనా ఇబ్బందులు వెంటాడుతున్నాయి. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారినపడి జట్టుతోపాటు లండన్ విమానం ఎక్కలేదు. ప్రస్తుతం కొవిడ్ నుంచి కోలుకున్న అశ్విన్ బుధవారం ఇంగ్లాండ్ బయల్దేరే అవకాశముందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తాజాగా మరో వార్త టీమ్‌ఇండియా అభిమానులను కలవరపెడుతోంది. కీలక ఆటగాడు విరాట్ కోహ్లీకి ఇటీవల కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. సతీమణి అనుష్క శర్మ, కూమార్తె వామికాతో కలసి విహారయాత్రకు మాల్దీవులు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొచ్చాక విరాట్ కరోనా బారిన పడినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడు కరోనా నుంచి కోలుకున్న తర్వాతే టీమ్‌ఇండియాతో కలిసి ఇంగ్లాండ్ బయలుదేరాడని తెలుస్తోంది. అయితే ఈ విషయమై బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విరాట్ కూడా ఈ మేరకు ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్‌లు పెట్టలేదు.
Virat Kohli Covid: విరాట్ కోహ్లీకి కరోనా.. అక్కడికి వెళ్లిన తర్వాతే..!
Virat Kohli Covid: ఇంగ్లాండ్‌తో రీషెడ్యూల్ టెస్టు నేపథ్యంలో టీమ్‌ఇండియాను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా కొవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది. అయితే అది కొద్ది వారాల కిందట అని సమాచారం. వైరస్ నుంచి కోలుకున్న తర్వాతే అతడు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాడని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం కోహ్లీ ఇంగ్లాండ్‌లో జట్టుతోపాటు ఉన్నాడు. అక్కడ షాపింగ్ చేయడానికి వివిధ ప్రదేశాలకు వెళ్లి అభిమానులతో ఫొటోలు దిగాడు. రోహిత్ శర్మ కూడా షాపింగ్ అంటూ బయట తిరిగినట్లు ఫొటోలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిద్దరికీ బీసీసీఐ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే విరాట్‌కి ఇప్పటికే కరోనా వచ్చి తగ్గిందని వార్తలు రావడం గమనార్హం. కరోనా సోకి తగ్గిన వెంటనే ఇలా ప్రజల మధ్య ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా తిరిగితే మరోసారి కరోనా వచ్చే అవకాశముందని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే వార్నింగ్ ఇచ్చిందని కూడా అంటున్నారు. కరోనా పరిస్థితుల వల్లే గతేడాది వాయిదా పడిన ఐదో టెస్ట్ మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జులై 1 - 5 మధ్య జరుగుతుంది.
ఇదీ చూడండి:డీకే.. ఏకంగా 108 స్థానాలు జంప్ .. టాప్10లో భారత్ నుంచి ఆ ఒక్కడే