తెలంగాణ

telangana

ETV Bharat / sports

అలా ఔట్ కావడం చిరాకేసింది: రాహుల్

లార్డ్స్​ టెస్టులో భారీ స్కోరు వద్ద వెనుతిరగడం బాధించిందన్నాడు టీమ్​ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్. మరిన్ని పరుగులు చేసి భారత్​ను పటిష్ట స్థితిలో నిలపాలనుకున్నట్లు తెలిపాడు.

KL Rahul
కేఎల్ రాహుల్

By

Published : Aug 14, 2021, 11:18 AM IST

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న రెండో టెస్టులో భారీ స్కోరు వద్ద ఔట్​ కావడం చిరాకు తెప్పిందన్నాడు టీమ్​ఇండియా ఓపెనర్ కేఎల్​ రాహుల్. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనుకున్నట్లు తెలిపాడు. కానీ వెంటనే పెవిలియన్ చేరడం బాధించిందన్నాడు. తొలి రోజు 127 పరుగులతో అజేయంగా నిలిచిన రాహుల్​.. రెండో రోజున మరో రెండు పరుగులకే వెనుతిరిగాడు.

"ఔటైన ప్రతీసారి బాధపడతా. నిరాశచెందుతా. రెండో రోజు ఆటలో కూడా ఉదయం సెషన్​ కల్లా మరో 70-80 పరుగులు చేయాలనుకున్నా. ఆ సమయంలో అంతా బాగానే ఉంది. కానీ ఔట్​ అవడమే చిరాకు తెప్పించింది."

-కేఎల్​ రాహుల్, టీమ్​ఇండియా బ్యాట్స్​మన్​

రాహుల్, రోహిత్ శర్మ (83) దీటైన ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా 364 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగుల వద్ద నిలిచింది. ప్రస్తుతం జో రూట్(48*), జానీ బెయిర్​స్టో(6*) క్రీజులో ఉన్నారు.

ఇదీ చూడండి:'కోహ్లీని ఔట్​ చేయడానికి పన్నిన వ్యూహమదే'

ABOUT THE AUTHOR

...view details