ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు కరోనా బారినపడి విమర్శలు ఎదుర్కొంటున్న టీమ్ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్‌ను వెనకేసుకొచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. అన్ని వేళలా మాస్కు ధరించడం భౌతికంగా సాధ్యపడదని అన్నాడు.
"ఇంగ్లాండ్‌లో యూరో ఛాంపియన్షిప్, వింబుల్డన్ చూశాం. నిబంధనలు మారాయి. ప్రేక్షకులను మైదానంలోకి అనుమతిస్తున్నారు. పైగా క్రికెటర్లు సెలవులపై ఉన్నారు. అన్ని సమయాల్లో మాస్కు ధరించడం అనేది సాధ్యం కాదు."
-సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం 20 రోజుల విరామంలో ఉంది కోహ్లీ సేన. ఈ క్రమంలోనే యూరో కప్ చూడటానికి వెళ్లిన పంత్‌కు కరోనా సోకింది. మాస్కు ధరించకుండా నిర్లక్ష్యంగా ఉన్నందు వల్లే అతడు వైరస్ బారిన పడ్డాడని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలోనే పంత్‌కు మద్దతుగా నిలిచాడు దాదా.