ఇంగ్లాండ్తో నాలుగో టెస్టులో టీమ్ఇండియా కష్టాల్లో ఉంది. నాలుగో రోజు లంచ్ విరామ సమయానికి 329/6 పరుగులతో నిలిచింది. ప్రస్తుతం 230 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో పంత్, శార్దుల్ ఠాకుర్ ఉన్నారు. ఈ రోజు భారత జట్టు బ్యాటింగ్ చేసిన దానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది.
Ind vs Eng: కష్టాల్లో భారత్.. లంచ్ విరామానికి 329/6 - ind vs eng
నాలుగో టెస్టులో గెలవాలంటే టీమ్ఇండియా చెమటోడ్చక తప్పదు! లేదంటే ఓడిపోయే ప్రమాదముంది. నాలుగో రోజు లంచ్ విరామ సమయానికి 230 పరుగుల ఆధిక్యంతో ఉంది.
కోహ్లీ
అంతకుముందు నాలుగో రోజు ఆటను 270/3 స్కోరుతో మొదలుపెట్టిన టీమ్ఇండియా.. ఆచితూచి బ్యాటింగ్ చేసింది. కోహ్లీ(Kohli)-జడేజా జోడీ నెమ్మదిగా స్కోరు బోర్డును కదిలించారు. అయితే వరుస విరామాల్లో కోహ్లీ(44), జడేజా(17), రహానె(0) ఔటయ్యారు.