తెలంగాణ

telangana

ETV Bharat / sports

INDvsENG 2nd Test: రెండో రోజు హైలైట్స్​ చూసేయండి! - మహ్మద్‌ సిరాజ్‌

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్ల మధ్య ఆధిపత్యం నీదా నాదా అన్నట్లు సాగుతోంది. ఈ నేపథ్యంలో లార్డ్స్​లో రెండో రోజు ఆట హైలైట్స్​ మీ కోసం..

IND vs ENG
కేఎల్‌ రాహుల్‌

By

Published : Aug 14, 2021, 12:06 PM IST

లార్డ్స్‌ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆధిపత్యం కోసం రెండు జట్లు పోరాడుతున్నాయి. నువ్వానేనా అన్నట్టు ఆడుతున్నాయి. 400+ స్కోరు చేస్తుందని భావించిన టీమ్‌ఇండియా 364కే పరిమితమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ఆరంభించిన కోహ్లీసేన వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంది.

జేమ్స్‌ అండర్సన్‌ సహా మిగతా పేసర్లు రాణించడం వల్ల కేఎల్‌ రాహుల్‌ (129), అజింక్యా రహానె (1) వెంటవెంటనే ఔటయ్యారు. రిషభ్ పంత్‌ (37), రవీంద్ర జడేజా (40) కాసేపు పోరాడారు. ఆ తర్వాత బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ రెండో రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది.

కెప్టెన్‌ జోరూట్‌ (48* బ్యాటింగ్‌; 75 బంతుల్లో 6×4) అర్ధశతకానికి చేరువయ్యాడు. అతడికి జానీ బెయిర్‌స్టో (6* బ్యాటింగ్‌) తోడుగా ఉన్నాడు. ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ (49) ఒక పరుగు తేడాతో అర్ధశతకం చేజార్చుకున్నాడు. ఇంగ్లాండ్‌లో అండర్సన్‌ 5 వికెట్లు పడగొట్టగా భారత్‌లో మహ్మద్‌ సిరాజ్‌ 2, మహ్మద్‌ షమి ఒక వికెట్‌ తీశారు.

రెండో రోజు ఆట హైలైట్స్‌ మీకోసం..

ఇదీ చూడండి:అలా ఔట్ కావడం చిరాకేసింది: రాహుల్

ABOUT THE AUTHOR

...view details