క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కి సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో జూన్ 7 నుండి 11 వరకు జరగనున్న ఈ మహా టోర్నీ కోసం.. ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే ఇండియా, ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు.. ఇంగ్లాండ్‌కు పయనమవ్వనున్నారు. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం ఈ చారిత్రాత్మక పోరుకు వేదిక కానుంది. ఎంతో ఉత్కంఠ కలిగిన ఈ మ్యాచ్‌లో ఇప్పుడు మరో విశేషాన్ని సంతరించుకోనుంది. ఎప్పటి నుంచో వాడుతున్న డ్యూక్ బంతికి బదులుగా కూకబుర్ర బంతిని ఉపయోగించాలని ఐసీసీ నిర్ణయించినట్లు సమాచారం.
ఇటీవలే ఐసీసీతో జరిగిన సమావేశంలో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్.. ఈ కొత్త రకం బాల్ గురించిప్రస్తావించాడు. డ్యూక్ కంటే కూకబుర బంతి ఎలా మెరుగ్గా ఉంటుందో వివరించాడు. "ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్ అంటే అదే హైలైట్. భారత స్పిన్నర్లు, ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ల మధ్య పోరు ఉత్కంఠ రేపనుంది. ఓవల్ మైదానంలో ఇది కచ్చితంగా జరుగుతుంది. ఓవల్ పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు మంచిది. మరోవైపు ఇది స్పిన్నర్లకు కొంత మేరకు అనుకూలంగా కూడా ఉంటుంది. అయితే డ్యూక్ బాల్ ఈ గేమ్‌లో అంత ప్రభావవం చూపించదు. కాబట్టి కూకబుర బంతిని వాడాలి." అని ఐసీసీకి సూచించాడు.
మరోవైపు గతేడాది జరిగిన మ్యాచ్ కోసం.. ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించింది. ఆ సమయంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా డ్యూక్ బంతిపై ఫిర్యాదు చేశాడు. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బంతి ఆకారాన్ని కోల్పోతుందని, మృదువుగా మారి స్వింగ్ కోల్పోతుందని అతను అన్నాడు.
ఇక ఈ బాల్ విశేషాలు ఏంటంటే..
కూకబుర్ర ఒక ఆస్ట్రేలియన్ స్పోర్టింగ్ గూడ్స్ కంపెనీ. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా,సౌత్ఆఫ్రికా, పాకిస్థాన్‌తో సహా చాలా జట్లు ఆయా దేశాల్లో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు కూకాబుర కంపెనీ బంతిని ఉపయోగిస్తూ వస్తున్నాయి. ఇక ఈ బంతికున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇందులోని లోపలి రెండు పొరలు చేతితో కుట్టినవి. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ ఈ డ్యూక్ బంతిని ఉపయోగించారు. చెర్రీ ఎరుపు రంగులో ఈ బాల్ మెరిసిపోతూ కనిపిస్తుంది. కాగా కూకబుర బాల్‌తో పోలిస్తే ఎస్జీ బాల్‌ను కుట్టడానికి ఉపయోగించే దారం మందంగా ఉంటుంది. దీంతో ఎస్జీ బాల్లో కుట్లు మధ్య దూరం కాస్త తక్కువగా ఉంటుంది.
అంతే కాకుండా ఈ కూకబుర బాల్ సీమ్ వైపు పట్టు బాగా ఉంది. బౌలర్లు తమ ప్రయోజనం కోసం దానిని సురక్షితంగా పట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది. బంతి మెరుపును కోల్పోయిన తర్వాత కూడా ఈ కూకబుర్రా.. ఎత్తుగా బౌన్స్ చేయగలదు. కాబట్టి ఫాస్ట్, మీడియం పేస్ బౌలర్లు బౌన్స్ ద్వారా బ్యాట్స్మెన్లను కట్టడి చేయవచ్చు. ఈ ముఖ్యమైన టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇప్పటికే టీమ్ ఇండియాను ప్రకటించింది. అంతకుముందు టెస్టు జట్టు నుంచి తప్పుకున్న అజింక్యా రహానే.. ఈ మ్యాచ్‌తో మళ్లీ పునరాగమనం చేశాడు.