India Vs Australia World Cup 2023 Final :దేశం మొత్తం వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్‌తో ఊగిపోతోంది. అహ్మదాబాద్ వేదికగా టీమ్ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్ కప్ సమరం మరి కొద్ది గంటల్లో మొదలు కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్‌ను ముద్దాడుతుందా.. లేదా ఆరోసారి ఆసీస్ టైటిల్ ఎగరేసుకుపోతుందా అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఫైనల్ మ్యాచ్ కోసం అన్ని విధాలా తాము సిద్ధం అయినట్లు తెలిపాడు. తమకు ఏం చేయాలో తెలుసునని స్పష్టం చేశాడు .
"నేను భారత క్రికెట్ జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టనప్పటి నుంచి ఇలాంటి ఒక రోజు కోసమే ఎదురు చూశాను. ఈ ప్రపంచకప్ కోసం మేము రెండేళ్ల కిందటి నుంచి సన్నాహాలు మొదలుపెట్టాము. అన్ని ఫార్మాట్‌లలో మేము ఒక యూనిట్‌గా అద్భుతంగా ఆడుతున్నాం. టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి వారి పొజిషన్‌పై ఒక క్లారిటీ ఉంది. అన్ని ఫార్మాట్‌లలో ప్లేయర్ల ప్రదర్శనను బట్టి ఛాన్స్‌లు ఇస్తున్నాం. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాం. ఆదివారం కూడా అదే జోరును కొనసాగిస్తామని ఆశిస్తున్నాను. ఇక ఆసీస్‌ను మేము తేలికగా తీసుకోకూడదు. వరల్డ్ వైడ్‌గా క్రికెట్‌లో అత్యుత్తమ టీమ్‌లో ఆసీస్ ఒకటి. ఈ వరల్డ్ కప్‌లో వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిచి ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఆ జట్టు ఎలా ఆడగలదో మాకు తెలుసు"
--రోహిత్ శర్మ, టీమ్ఇండియా కెప్టెన్