తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ x ఆస్ట్రేలియా - నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ ఎలా ఉందంటే?

India Vs Australia World Cup 2023: వన్డే ప్రపంచకప్​లో భాగంగా జరగనున్న తుది పోరుకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే వేదికకు చేరుకున్న ప్లేయర్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. అయితే మ్యాచ్​ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న సమయంలో పిచ్​ ఎలా ఉందో ఓ సారి చూద్దాం..

India Vs Australia World Cup 2023
India Vs Australia World Cup 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 5:22 PM IST

Updated : Nov 18, 2023, 6:21 PM IST

India Vs Australia World Cup 2023 : క్రికెట్​ లవర్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. అహ్మదాబాద్​లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా వరల్డ్​ కప్​ తుది పోరుకు సర్వం సిద్ధమైంది. క్రికెట్​ అభిమానులు అహ్మదాబాద్​కు పయనమవుతున్నారు. ఇప్పటికే వేదికకు చేరుకున్న ప్లేయర్లు కూడా తీవ్ర కసరత్తులు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో కీలక పోరులో జరిగే పిచ్​ ఎలా ఉందో తెలుసుకుందాం.

మ్యాచ్​ ప్రారంభానికి 48 గంటల ముందు పిచ్​ మార్చెందుకు రెడీ అయ్యారు క్యురేటర్లు. ఫైనల్​ మ్యాచ్​ కోసం క్యూరేటర్లు రెండు పిచ్​లను సిద్ధం చేశారు. అయితే ఆ రెండు స్ట్రిప్​లు స్టేడియం సెంటర్​లో లేవు. అందులో ఒక పిచ్​ గ్రౌండ్​కు కుడి వైపు ఉంది. దీంతో దీనికి ఎడమవైపు ఉన్న పిచ్​ను రెడీ చేసే పనుల్లో ఉన్నారు క్యూరేటర్లు. ఇక పిచ్ రెడీ అయిన కాసేపటికీ దాన్ని పరిశీలించేందుకు టీమ్ఇండియా కెప్టెన్​ రోహిత్ శర్మ, హెడ్ కోచ్​ రాహుల్​ ద్రవిడ్ వచ్చారు. వారు స్వయంగా తమ టెక్నిక్స్​తో ఆ పిచ్​ను పరిశీలించారు. అయితే సరిగ్గా పిచ్​ రెడీ చేసే సమయంలో క్యూరేటర్​ ఆండీ ఆట్కిన్సన్​ స్టేడియంలో లేడంటూ కథనాలు వచ్చాయి. అయితే శుక్రవారం మధ్యాహ్నం అహ్మదాబాద్​ చేరుకున్న ఆండీ.. శనివారం పిచ్ ప్రిపరేషన్స్​లో పాల్గొన్నారని టాక్​ సమాచారం.

పిచ్​ రిపోర్టు..
సాధారణంగా అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్​కు అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ ప్రపంచకప్​లో మాత్రం ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచ్​ల్లో ఒక్క సారి కూడా ఏ ఒక్క జట్టు కూడా 300 పరుగులు సాధించలేకపోయారు. అయితే ఈ సారి మాత్రం పిచ్​.. స్పిన్​కు అనుకూలించే అవకాశం ఉన్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన జట్టు.. బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అహ్మదాబాద్ పిచ్ పై ఛేజింగ్ కష్టం. ఈ మైదానంలో యావరేజ్ స్కోర్ చూసుకుంటే 237గా ఉంది. అయితే దీంతో పిచ్ బ్యాటింగ్ చేయడానికి కష్టమని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టాస్ కీలకంగా మారే అవకాశం ఉంది.

Last Updated : Nov 18, 2023, 6:21 PM IST

ABOUT THE AUTHOR

...view details