తెలంగాణ

telangana

ETV Bharat / sports

తేలిపోయిన టీమ్​ఇండియా బౌలర్లు.. తొలి టీ20లో ఆసీస్‌ ఘన విజయం - undefined

మహిళల టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20లో ఆసీస్‌ అదరగొట్టింది. టీమ్‌ఇండియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యం సంపాదించింది.

india vs australia women t20 match
india vs australia women t20 match

By

Published : Dec 9, 2022, 10:31 PM IST

Indw vs Ausw: మహిళల టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20లో ఆసీస్‌ అదరగొట్టింది. టీమ్‌ఇండియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే నష్టపోయి ఛేదించింది. ఆసీస్‌ ఓపెనర్‌ బెత్ మూనీ (89; 57 బంతుల్లో 16 ఫోర్లు) విజయంలో కీలకపాత్ర పోషించింది. అలిస్సా హీలీ (37; 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. తహ్లియా మెక్‌గ్రాత్ (40) ఫర్వాలేదనిపించింది. భారత్ బౌలర్లలో దేవిక వైద్య ఒక వికెట్ పడగొట్టగా మిగతా బౌలర్లు ఒక్క వికెట్టూ కూడా పడగొట్టలేకపోయారు.

ఓపెనర్లు తొలి మూడు ఓవర్లపాటు నెమ్మదిగా ఆడినా తర్వాత నుంచి జోరు పెంచారు. దీంతో 8 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 68/0గా నమోదైంది. ఈ జోడీ దూకుడుకు తొమ్మిదో ఓవర్‌లో దేవిక వైద్య బ్రేక్‌లు వేసింది. అలిస్సాని ఔట్‌ చేసి భారత్‌కు ఉపశమనాన్ని అందించింది. తర్వాత క్రీజులోకి వచ్చిన మెక్‌గ్రాత్‌తో కలిసి బెత్‌ మూనీ ఇన్నింగ్స్‌ని ముందుకు తీసుకెళ్లి ఆసీస్‌కు విజయాన్ని అందించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details