టీమ్ఇండియాలో వైస్‌కెప్టెన్ రోల్‌పై భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో ఆడే మ్యాచ్‌లకు వైస్‌కెప్టెన్ అవసరం లేదని అన్నాడు. వైస్‌కెప్టెన్ అనే పొజిషన్ వల్లే జట్టులో కొనసాగుతున్నారని.. దీంతో తుది జట్టును సెలెక్ట్ చేయడం కష్టతరంగా మారిందని చెప్పాడు. కాగా, కొన్ని రోజుల ముందు వరకు టెస్టులతో పాటు వన్డేల్లో కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా కొనసాగాడు. ఆ తర్వాత మిగతా రెండు టెస్ట్‌లకు వైస్ కెప్టెన్‌గా రాహుల్‌ను తప్పించింది జట్టు యాజమాన్యం.
కాగా, ఫామ్‌లేమితో విఫలమవుతున్న రాహుల్ స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను ఆడించాలని రవిశాస్త్రి చెప్పాడు. ''రాహుల్ ఫామ్, మానసిక దృక్పథం గురించి.. శుభ్‌మన్ గిల్ లాంటి ప్లేయర్‌ను ఎలా చూడాలో కూడా తెలుసు. నేనెప్పుడూ భారత జట్టుకు వైస్‌కెప్టెన్‌ను ఉండకూడదనే అనుకున్నా. అత్యుత్తమ తుది జట్టుతో బరిలో దిగాలి. ఒకవేళ టీమ్ కెప్టెన్ మైదానం వీడాల్సి వస్తే అప్పుడు పరిస్థితులను బట్టి మరో ఆటగాడికి బాధ్యతలు ఇవ్వొచ్చు. పరిస్థితులను మరీ కాంప్లెక్స్‌గా మార్చకూడదు. నా దృష్టిలో వైస్‌కెప్టెన్ హోదా ఉండకూడదు. ఈ విషయంలో నేను మొండిగానే ఉంటా. స్వదేశంలో వైస్‌కెప్టెన్ అవసరమే లేదు. విదేశాల్లో అయితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శుభ్‌మన్ లాంటి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు కావాలి. జట్టు తలుపులు బద్దలుకొట్టి అతను లోపలికి రావాలి. ఇప్పుడు రాహుల్ వైస్ కెప్టెన్ కాదు కాబట్టి జట్టు యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకోవాలి." అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.