India Vs Australia T20 Series 2023 :వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓటమి అనంతరం.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ఇండియా శుభారంభం చేసింది. విశాఖపట్టణం వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (80 పరుగులు : 42 బంతుల్లో, 9x4, 4x6), ఇషాన్ కిషన్ (58 పరుగులు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. చివర్లో రింకూ సింగ్ (22 పరుగులు నాటౌట్ : 14 బంతుల్లో, 4 ఫోర్లు) రాణించడం వల్ల భారత్ నెగ్గింది. ఇక తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఆసీస్ బౌలర్లలో తన్వీర్ సంఘా 2, మాథ్యు షాట్, సీన్ అబాట్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో 1-0తో అధిక్యంలో నిలిచింది.
భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్ యశ్వస్వి జైస్వాల్ (21) ఫర్వాలేదనిపించినా.. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, అర్షదీప్ డైమండ్ డకౌట్ అయ్యారు. తొందరగా ఆడే ప్రయత్నంలో తిలక్ వర్మ (12) క్యాచౌట్గా పెలివియన్ చేరాడు. అక్షర్ పటేల్ (2) కూడా తొందరగానే ఔట్ అయ్యారు. రింకూ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.