భారత స్పిన్ మాయాజాలానికి మరోసారి ఆసీస్ కుప్పకూలింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో బాగంగా దిల్లీలో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ జడేజా విశ్వరూపం చూపాడు. ఏకంగా 7 వికెట్లను పడొగొట్టాడు. అశ్విన్ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఒక్క పరుగు ఆధిక్యంలో ఉంది. తాజాగా 113 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ ముందు 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఉంచినట్లయింది.
జడేజా విశ్వరూపం.. ఆసీస్ ఆలౌట్.. భారత్ లక్ష్యం ఎంతంటే? - india australia latesta news
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్.. రెండో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్లు సత్తా చాటారు. రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్ నైట్ స్కోరు 61/1తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. టీమ్ఇండియా స్పిన్నర్ల ధాటికి చిగురుటాకులా వణికిపోయి 113 పరుగులకు ఆలౌటైంది.
ఓవర్ నైట్ స్కోరు 61/1తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌కు ఆదిలోనే షాక్ ఎదురైంది. పెనర్ ట్రెవిస్ హెడ్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. 43 పరుగులు చేసిన ట్రెవిస్ హెడ్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత 85 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన స్మిత్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. జడేజా బౌలింగ్‌లో లబుషేన్ క్లీన్ బౌల్డ్ కాగా.. అశ్విన్ బౌలింగ్‌లో మాట్ రెన్ షా ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుసగా బ్యాటర్లు చేతులెత్తేశారు. 95 పరుగుల వద్ద ఒక్క పరుగు కూడా చేయకుండా.. నలుగురు ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు చేరారు. అప్పటికే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 24 ఓవర్లో జడేజా వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు సాధించాడు. తొలి బంతికి హ్యాండ్ కాంబ్‌ను పెవిలియన్‌కు పంపగా.. రెండో బంతికి కమ్మిన్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. జడేజా విశ్వరూపంతో ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది.