తెలంగాణ

telangana

ETV Bharat / sports

లైయన్ స్పిన్​ పంజా​.. భారత్​ ఆలౌట్​.. ఆసీస్​ టార్గెట్​ ఎంతంటే?

భారత్​-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్​.. రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్​లోనూ టీమ్​ఇండియా ఆలౌట్​ అయ్యి 163​ పరుగులు సాధించింది. ఆసీస్​కు 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

india vs australia
india vs australia

By

Published : Mar 2, 2023, 4:55 PM IST

Updated : Mar 2, 2023, 5:15 PM IST

బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ ఓటమి దిశగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకు ఆలౌటై ఆసీస్‌కు కేవలం 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమ్‌ఇండియా ఆలౌటైన క్రమంలో రెండో రోజు ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఛెతేశ్వర్‌ పుజారా (59) అర్ధ శతకం బాది జట్టును ఆదుకున్నాడు. ఒ0కవేళ పుజారా కూడా రాణించకపోతే భారత్‌ ఇన్నింగ్స్‌ తేడాతో ఓటమిపాలు అయ్యేది.

రెండో ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా బ్యాటర్లు పుజారా తప్ప మిగతా వారంతా విఫలమయ్యారు. ఓపెనర్లు రోహిత్​ శర్మ, శుభమన్​ గిల్​ వెంట వెంటనే పెవిలియన్​ చేరారు. తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన స్టార్​ బ్యాటర్​ కోహ్లీ కూడా నిరాశపరిచాడు. కేవలం 13 పరుగులు చేసి కున్​మెన్​ బౌలింగ్​లో ఎల్​బీడబ్ల్యూగా ఔటయ్యాడు. బౌలింగ్​లో అదరగొట్టిన రవీంద్ర జడేజా స్వల్ప పరుగులకే పెవిలియన్​ చేరాడు.

ఇక శ్రేయస్ అయ్యర్​ .. పుజారాతో కలిసి రాణిస్తుడానుకున్న సమయంలో స్టార్క్​ బౌలింగ్​లో ఔటయ్యాడు. దీంతో టీమ్​ఇండియా కష్టాల్లో పడింది. ఆ తర్వాత అశ్విన్​ కూడా 16 పరుగులకే ఔటయ్యాడు. హాఫ్​ సెంచరీతో మెరిసిన పుజారా కూడా పెవిలియన్​ బాట పట్టాడు. ఆసీస్​ బౌలర్లలో నాథన్​ లైయన్​ ఎనిమిది వికెట్లు తీసి విశ్వరూపం చూపించాడు. మిచెల్​ స్టార్క్​, కున్​మెన్​ చెరో వికెట్​ పడగొట్టారు.

అంతకుముందు, ఓవర్‌నైట్ స్కోరు 156/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు పీటర్ హ్యాండ్స్‌ కోంబ్, కామెరూన్ గ్రీన్ కలిసి శుభారంభం అందించారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే 98 బంతుల్లో ఓ ఫోర్‌తో 19 పరుగులు చేసిన పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌ను అశ్విన్ పెవిలియన్ పంపాడు. హ్యాండ్స్​కోంబ్​.. అశ్విన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్​ అయ్యాడు. ఆ తర్వాత ఉమేశ్​ యూదవ్​ కూడా తన బౌలింగ్​తో మ్యాజిక్ చేశాడు.

అతడు.. 57 బంతుల్లో 2 ఫోర్లతో 21 రన్స్​ చేసిన కామెరూన్ గ్రీన్​ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. అలానే మిచెల్ స్టార్క్‌(1)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అలెక్స్ క్యారీ(3).. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ వెంటనే టాడ్ ముర్ఫీని ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అలా వరుసగా 5 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. చివరిగా 5 పరుగులు చేసిన నాథన్ లియాన్‌ను రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయడం వల్ల.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కి 197 స్కోరు వద్ద తెరపడింది.

Last Updated : Mar 2, 2023, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details