క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా ప్లేయర్ నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో ఒక్క నోబాల్ లేకుండా శనివారం నాటికి 30, 000 బంతులు వేశాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో లియోన్ ఈ అరుదైన రికార్డు నమోదు చేశాడు. 2011లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన లియోన్.. 116 టెస్టుల్లో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 461 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు ఈ స్పిన్నర్ 29 వన్డేలు, 2 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక 31 వైట్‌బాల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన లియోన్.. 30 వికెట్లు తీశాడు.
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు.. నోబాల్ వేయకుండానే 30 వేల బంతులు..! - నాథన్ లియోన్ అరుదైన రికార్డు
క్రికెట్ చరిత్రలో ఇప్పుటివరకు కనీవినీ ఎరుగని రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియోన్ ఒక్క నోబాల్ లేకుండా 30, 000 బంతులు వేశాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పుర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో లియోన్ ఈ ఘనత సాధించాడు.
తన కెరీర్‌లో 100కు పైగా టెస్టులు ఆడిన నాథన్ లియోన్ ఒక్కసారి కూడా క్రీజు దాటకపోవడమనేది సాధారణ విషయం కాదు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఇంత పద్ధతిగా, క్రమశిక్షణగా, నిలకడగా బౌలింగ్ చేయడమనేది ఇప్పటి తరం ప్లేయర్లకు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. టెస్ట్ క్రికెట్‌లో ఏ బౌలర్‌కు సాధ్యంకాని ఈ రికార్డును ప్రముఖ గణాంకవేత్త మజర్ అర్షద్ వెలుగులోకి తెచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించారు.
ఇక, మొదటి టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్ 132 పరుగులతో విజయం సాధించింది. రోహిత్ శర్మ, జడేజా సూపర్ ప్రదర్శన తర్వాత రెండో రోజు అక్షర్ పటేల్(84) పరుగులతో రాణించగా.. మూడు సిక్సులు, రెండు ఫోర్లు బాది మహ్మద్ షమీ(37) పరుగులతో చెలరేగిపోయాడు. ఇక, బౌలర్ల విషయానికొస్తే.. స్పిన్నర్ అశ్విన్, జడేజా, షమీ అద్భుతంగా బౌలింగ్ వేసి టీమ్ఇండియాను విజయ తీరాలకు చేర్చారు.