12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వెటరన్ పేసర్, రంజీ ఛాంపియన్ జయదేవ్ ఉనాద్కత్.. వన్డే జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. ఆదివారమే ముగిసిన దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీరంజీ ట్రోఫీ 2022-23లో సౌరాష్ట్రను విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ జయదేేవ్కు బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు కల్పించింది. దీంతో అతడు 10 ఏళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు సంపాదించాడు. చివరగా 2013లో అతడు వన్డే మ్యాచ్ ఆడాడు.
బంగాల్‌తో జరిగిన రంజీ ఫైనల్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొంది వరుసగా రెండో సారి టైటిల్‌ను అందుకుంది. గత సీజన్ రంజీ ట్రోఫీ 2021-22ని కూడా సౌరాష్ట్రనే గెలచింది. ఫైనల్లో సత్తా చాటిన కెప్టెన్ జయదేవ్ ఉనాద్కత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.