తెలంగాణ

telangana

ETV Bharat / sports

నెట్​ బౌలర్లుగా నలుగురు టాప్‌ స్పిన్నర్లు.. సిరీస్ గెలుపే​ లక్ష్యంగా టీమ్‌ఇండియా సాధన - బోర్డర్​ గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్

India vs Australia 2023 Test Series : ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే ఇండియా, ఆస్ట్రేలియా టెస్ట్​ సిరీస్​పైనే అందరి చూపు ఉంది. దీంతో ఇరు జట్లు ప్రాక్టీసులో జోరు పెంచాయి. ముఖ్యంగా.. టీమ్ఇండియా నలుగురు టాప్​ స్పిన్నర్లను నెట్​ బౌలర్లుగా పెట్టుకుని సాధన చేస్తోంది.

india vs australia
india vs australia

By

Published : Feb 4, 2023, 3:40 PM IST

India vs Australia 2023 Test Series : ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బోర్డర్​-గావస్కర్​ టెస్టు సిరీస్‌ ​కోసం టీమ్‌ఇండియా సాధన మొదలు పెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ , శుభ్‌మన్‌ గిల్, రవీంద్ర జడేజా, సిరాజ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌.. లాంటి కీలక ఆటగాళ్లు ప్రాక్టీస్ షురూ చేశారు. మొదటి టెస్టుకు నాగ్‌పుర్‌ వేదిక కానుంది. స్వదేశంలో సిరీస్‌ అనగానే.. భారత్ స్పిన్‌ పిచ్‌లకే ప్రాధాన్యం ఇస్తుందనే అంచనాలు ప్రత్యర్థి జట్టుతోపాటు క్రికెట్ విశ్లేషకుల్లోనూ ఉన్నాయి. దీంతో టీమ్ఇండియా ప్లేయర్లు కూడా స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రాక్టీస్‌ సెషన్‌లోనే నలుగురు స్పిన్నర్లను నెట్‌బౌలర్లుగా ఎంపిక చేసుకున్నారు. అందులో వాషింగ్టన్ సుందర్, ఆర్‌ సాయి కిశోర్, సౌరభ్‌ కుమార్‌, రాహుల్‌ చాహర్‌ ఉన్నారు. వీళ్లలో రాహుల్‌ చాహర్‌ లెగ్ స్పిన్నర్‌ కాగా.. మిగతా ముగ్గురు ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్లు. ఇప్పటికే పేసర్లు.. సిరాజ్, జయ్‌దేవ్‌ బౌలింగ్‌లో టీమ్​ఇండియా బ్యాటర్లు సాధన చేస్తున్నారు.

ఇక, ఆసీస్​ జట్టు కూడా నలుగురు స్పిన్నర్లతో ఇక్కడకు వచ్చింది. అందులో ముగ్గురు ఆఫ్ స్పిన్నర్లు కాగా.. మరొకరు లెగ్‌ స్పిన్నర్. నాథన్ లియాన్, ఆష్టన్ అగర్, టాడ్‌ మర్ఫీ, మిచెల్‌ స్వేప్సన్ ఉన్నారు. అంతేకాకుండా మరో ఇద్దరిని పార్ట్‌టైమ్‌ బౌలర్లను ఏర్పాటు చేసుకుంది. బ్యాటర్లు ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ కూడా స్పిన్‌ బౌలింగ్‌ను వేసేలా ఆసీస్‌ జట్టు తర్ఫీదు ఇచ్చింది. బెంగళూరులో జరుగుతున్న తమ ప్రాక్టీస్ సెషన్స్‌ కోసం అచ్చం రవిచంద్రన్ అశ్విన్‌ మాదిరిగా బౌలింగ్‌ వేసే బరోడా ఆటగాడు మహీశ్‌ పితియాను కూడా రప్పించుకొంది కంగారూ జట్టు.

ABOUT THE AUTHOR

...view details