India vs Australia 1st T-20 in Visakhapatnam:ప్రపంచకప్ సమరం ముగిసిన వెంటనే.. భారత్, ఆసీస్ జట్ల మధ్య జరిగే 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి ట్వంటీ-20 మ్యాచ్ నిర్వహణకు విశాఖ ముస్తాబు అయ్యింది. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో భారత జట్టు 90 శాతం విజయాలను నమోదు చేసింది. ఇప్పటికే విశాఖకు చేరుకున్న భారత, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేస్తూ మ్యాచ్‌కు సన్నద్ధం అవుతున్నారు.
Today India Australia T-20 Cricket Match in Visakhapatnam :రాత్రి 7 నుంచి 11 గంటల వరకు జరిగే డే అండ్ నైట్ మ్యాచ్‌కు సాయంత్రం 5 గంటల నుంచి ప్రేక్షకులను అనుమతించనున్నారు. స్టేడియం సామర్థ్యం.. సుమారు 28 వేల మంది కాగా.. 30కి పైగా గేట్ల ద్వారా ప్రేక్షకులను లోపలికి అనుమతించే అవకాశం ఉంది. మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అపశ్రుతులు జరగకుండా స్టేడియం చుట్టూ బారికేడ్లతో పాటు ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేశారు. 2 వేల మంది పోలీసు సిబ్బందితో మూడంచెల భద్రతతో పాటు స్టేడియం లోపల, వెలుపలా, చుట్టూ ఉన్న బహుళ అంతస్థులపైన, రూఫ్ టాప్‌లపై నిఘా పెట్టి పర్యవేక్షించనున్నారు. జన సామర్థ్యం అధికంగా ఉండే చోట్లా ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా బందోబస్తు చేశారు.
భారత్- ఆస్ట్రేలియా T20 మ్యాచ్, ఇరు జట్ల నెట్ ప్రాక్టీస్ - విశాఖలో భారీ ఏర్పాట్లు
Tight Security for Twenty 20 Match :ఎటువంటి అపశ్రుతులూ జరగకుండా ఉండటానికి స్టేడియంలోనికి వెళ్లే అన్ని గేట్ల వద్దా ఏసీపీ స్థాయి అధికారులను నియమించి, ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తూ, వారి టికెట్స్‌ను పరిశీలించి, ఎటువంటి గుంపులూ ఏర్పడకుండా క్యూ లైన్ నందు లోపలకి ప్రవేసించే ఏర్పాట్లు చేసారు. గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నకిలీ టిక్కెట్లు కొనుగోలు చేసి అభిమానులు మోసపోవద్దని నిర్వహణ కమిటీ సభ్యులు చెబుతున్నారు.