India Vs Afghanistan T20 Series :ఇంటర్నేషనల్ టీ20ల్లో అఫ్గానిస్థాన్ జట్టుపై పై టీమ్ఇండియాకు అజేయ రికార్డు ఉంది. ఇప్పటివరకూ ఆ జట్టు చేతిలో మన కుర్రాళ్లు ఓడిందే లేదు. ఆ జట్టుతో ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా నాలుగింట్లో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌కు మాత్రం ఫలితం తేలలేదు. అయితే ఇప్పుడు మొహాలీ వేదికగా మరోసారి అఫ్గాన్‌తో సిరీస్‌కు భారత జట్టు సిద్ధమైంది. కానీ ఈ సారి మాత్రం అఫ్గాన్లతో ఆటేం అంత సులువు కాదు. ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో ఆ జట్టు ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్వేదు. పసికూన అంటూ పక్కకు నెట్టిన వాళ్లకు చుక్కలు చూపించి మరీ తమ సత్తా చాటారు అఫ్గాన్ ప్లేయర్లు. పొట్టి ఫార్మాట్లో అయితే ఆ జట్టు మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. దీంతో టీమ్‌ఇండియా ఇక అతి విశ్వాసానికి పోకుండా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉందంటూ విశ్లేషకులు సూచిస్తున్నారు.
ఆ విజయాలే కారణం : క్రికెట్ హిస్టరీలో అఫ్గానిస్థాన్ ప్లేయర్లను అంటే పసికూలని పిలిచేవాళ్లు. కానీ ఇటీవలే జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఆ జట్టు ఫామ్ చూసినత తర్వాత అందరి అభిప్రాయాల్లో మార్పు వచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, మాజీ ఛాంపియన్లు పాకిస్థాన్, శ్రీలంకపై ఆ జట్టు విజయాలు నమోదు చేసి ఆ జట్లను చిత్తు చేసింది. ఇక ఆస్ట్రేలియాను భయపెట్టి అఫ్గాన్ సెమీస్‌కు చేరేలా కనిపించింది. కానీ మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీ వల్ల ఆ జట్టు ఆశలు కూలాయి.
అయితే సెమీస్ చేరకపోయినప్పటికీ ఆ జట్టు ఫామ్ అందరినీ ఆకట్టుకుంది. వన్డేల్లోనే ఇలా రాణించిన జట్టు ఇక టీ20ల్లోనూ మరింత చెలరేగే అవకాశాలు చాలానే ఉన్నాయి. దీంతో ఈ పొట్టి ఫార్మాట్లో అఫ్గాన్ జట్టును అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఒక్క ఓవర్లో ఫలితాలు తారుమారయ్యే స్థితి ఈ ఫార్మాట్లో ఆ జట్టు ప్రమాదకారే.