India Vs Afghanistan T20 Shubman Gill Rohit Sharma : రన్ ఔట్ అయిన ఫ్రస్టేషన్‌లోనే శుభ్‌మన్ గిల్‌పై ఫైర్ అయ్యాయని, ఆటలో ఇలాంటివి సహజమేనని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ తప్పిదం కారణంగా రోహిత్ శర్మ రనౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. దీంతో అసహనానికి గురైన హిట్ మ్యాన్ - శుభ్‌మన్ గిల్‌పై కాస్త మండిపడ్డాడు.
మ్యాచ్ అనంతరం ఈ విషయంపై రోహిత్ స్పందించాడు. ఇవన్నీ ఆటలో సహజమేనని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. మ్యాచ్‌లో ఎన్నో సానుకూలంశాలు లభించాయని అన్నాడు. "రనౌట్ అవ్వడం ఆటలో సహజం. అలా జరిగినప్పుడు అసహనానికి గురవ్వడం కూడా సాధారణమే. ఆ ఫ్రస్టేషన్‌లో అలా అనేశాను. ఉద్దేశపూర్వకంగా అన్నవి మాత్రం కాదు. టీమ్ కోసం బాగా ఆడాలనుకున్నప్పుడు ఇలా రనౌట్ అయితే ఎవరైన అసహనానికి గురౌతారు." అని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు.
"ఇకపోతే ఈ మ్యాచ్‌లో మేం గెలవడం చాలా ముఖ్యం. నేను ఔట్ అయిన తర్వాత శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను నడిపిస్తాడని అనుకున్నాను. దురదృష్టవశాత్తు అతడు కూడా ఔట్ అయిపోయాడు. ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంది. క్యాచ్ పట్టుకున్నప్పుడు వేలికి గాయమైంది. ప్రస్తుతం బాగానే ఉంది. ఈ మ్యాచ్‌లో మాకు అనేక సానుకూలంశాలు లభించాయి. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ముఖ్యంగా బాల్‌తో అద్భుతంగా రాణించాం. ప్రతికూల పరిస్థితుల్లోనూ మా స్పిన్నర్లు, పేసర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించారు. జితేశ్ శర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, తిలక్ వర్మ మంచి ప్రదర్శన చేశారు. ఫామ్‌ను కొనసాగించారు. భిన్నమైన విషయాలను ప్రయత్నించుకుంటున్నాం. వివిధ పరిస్థితులలో మా బౌలర్లు బౌలింగ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. వాషింగ్టన్‌తో 19వ ఓవర్ వేయించాం. మాకు కాస్త అసౌకర్యంగా ఉండే ప్రాంతాల్లో మాకు మేమే సవాలు చేయాలనుకుంటున్నాం. అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత వరకు బాగా ఆడేలా ప్రయత్నిస్తాం. కానీ ఆటను పణంగా పెట్టకూడదు. మేము పైకి వచ్చి ఆటను ఇంకా బాగా ఆడేలా ప్రయత్నించాలనుకుంటున్నాం. ఈ రోజు మాకు మంచి రోజు." అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
దంచేసిన దూబే- తొలి టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ
కన్ఫ్యూజైన రోహిత్- పాపం కుల్దీప్ను మర్చిపోయాడుగా