తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS WI : తొలి టెస్ట్​.. టాస్​ గెలిచిన విండీస్​.. భరత్​కు నో ఛాన్స్​ - ఇండియా వర్సెస్​ వెస్టిండీస్​ సిరీస్​

India Tour Of Westindies : భారత్​ - వెస్టిండీస్​కు మధ్య టెస్ట్ సిరీస్​ ప్రారంభమైంది. ఈ క్రమంలో టాస్​ గెలిచిన వెస్టిండీస్​ బ్యాటింగ్​ను ఎంచుకుంది.

india vs westindies
india vs westindies toss

By

Published : Jul 12, 2023, 7:14 PM IST

Updated : Jul 12, 2023, 7:47 PM IST

India Vs West indies Test : కరేబియా డొమినికాలోని విండ్సర్ పార్క్‌ వేదికగా భారత్​ - వెస్టిండీస్​కు మధ్య టెస్ట్ సిరీస్​ ప్రారంభమైంది. ఈ క్రమంలో టాస్​ గెలిచిన వెస్టిండీస్​ జట్టు బ్యాటింగ్​ను ఎంచుకుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇరు జట్లు తలపడనున్నాయి. రోహిత్‌ శర్మ నాయకత్వంలోని భారత యువదళంలో పుజారా స్థానాన్ని భర్తీ చేసేందుకు శుభ్‌మన్‌ గిల్‌ సిద్ధమయ్యాడు.

ఇక టీమ్​ఇండియా జట్టులో ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌ అరంగేట్రం చేయగా.. రోహిత్‌ శర్మతో కలసి యశస్వి ఓపెనింగ్‌ చేయన్నున్నాడన్న విషయం తెలిసిందే. అయితే తుది టీమ్​లో కేఎస్‌ భరత్‌ను కాకుండా ఇషాన్‌ కిషన్‌ను ఎంపిక చేయడానికి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో అతడు వికెట్‌ కీపర్‌గా వ్యవహరించనున్నాడు.

కాగా టీమ్​ఇండియాపై విండీస్‌ గెలిచి ఇప్పటికే రెండు దశాబ్దాలు దాటిపోయింది. సొంత గడ్డపై 2002లో చివరిగా ఆడిన మ్యాచ్​లో భారత జట్టుపై విజయం సాధించిన కరేబియన్‌ జట్టు ఆ టెస్టు సిరీస్‌ కైవసం చేసుకంది. ఇక అప్పటి నుంచి వెస్టిండీస్‌పై పైచేయి సాధించి తన జైత్రయాత్రను భారత్​ కొనసాగిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజా సిరీస్‌లో ఎవరిది పై చేయి కానుందో అన్న విషయంపై అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

టీమ్​ఇండియా తుది జట్టు :
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్​మన్​ గిల్​, అజింక్య రహానే, యశస్వి జైశ్వాల్, మహ్మద్ సిరాజ్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనాద్కట్‌ .

వెస్టిండీస్‌ తుది జట్టు:
క్రెగ్ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్), రేమన్ రీఫర్, తగెనరైన్ చంద్రపాల్, రకీమ్ కార్న్‌వాల్‌, జెర్మైన్ బ్లాక్‌వుడ్‌, అలీక్ అథనేజ్, జాషువా డా సిల్వా(వికెట్ కీపర్), జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్, జోమెల్ వారికాన్.

గత ఐదు టెస్టు మ్యాచ్‌ల ఫలితాలు ఇలా..

  • ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో వేదికలో జరిగిన మ్యాచ్‌ (2016) డ్రాగా ముగిసింది. అదీ వర్షం కారణంగా మ్యాచ్‌ ఫలితం డ్రాకు దారితీసింది. నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-0 తేడాతో గెలుచుకుంది.
  • హైదరాబాద్‌ వేదికగా 2018లో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై టీమ్‌ఇండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
  • రాజ్‌కోట్‌లో (2018) జరిగిన మ్యాచ్‌లోనూ భారత్‌దే విజయం. విండీస్‌పై ఏకంగా ఇన్నింగ్స్‌ 272 పరుగుల భారీ తేడాతో గెలవడం విశేషం.
  • భారత్ - విండీస్‌ మధ్య (2019) జమైకా వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 257 పరుగుల తేడాతో విజయం సాధించింది.
  • ఇదే ఏడాది (2019) అంటిగ్వా మైదానంలో జరిగిన మ్యాచ్‌లోనూ విండీస్‌పై భారత్‌ 318 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
Last Updated : Jul 12, 2023, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details