తెలంగాణ

telangana

ETV Bharat / sports

గంగూలీ, షా ఇంగ్లాండ్​ పర్యటన అందుకేనా? - ఇంగ్లాండ్ పర్యటనకు జైషా

IPL longer window: ఐపీఎల్​ విండోను పెంచేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై మాట్లాడటం సహా బర్మింగ్​హోమ్​లో జరగనున్న రిషెడ్యూల్​ టెస్టును వీక్షించేందుకు అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శ ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది.

IPL matches extend
ఐపీఎల్ మ్యాచులు పెంపు

By

Published : Jun 3, 2022, 2:25 PM IST

IPL longer window: ఎనిమిది జట్లు.. 74 మ్యాచ్​లతో రసవత్తరంగా సాగింది ఐపీఎల్​ 2022. అయితే వచ్చే సీజన్​ మరింత ఆసక్తికరంగా మార్చేందుకు మ్యాచ్​ల సంఖ్యను పెంచేలా బోర్డు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం గంగూలీ, జైషా ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లనున్నారట. అక్కడ ఐపీఎల్​ విండో సమయం పెంపు, మహిళల ఐపీఎల్​ విండో గురించి ఈసీబీ మేనేజింగ్​ డైరెక్టర్​ రాబ్​ కీతో చర్చించనున్నట్లు ఓ బోర్డు అధికారి తెలిపారు.

"ఇప్పటికే సమావేశ ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి షా ఇంగ్లాండ్​ వెళ్లనున్నారు. అక్కడ జరిగే రిషెడ్యూల్​ ఐదో టెస్టును వీక్షించనున్నారు. టెస్టు మ్యాచుకు ఒక రోజు ముందు జూన్​ 30న ఇంగ్లాండ్​కు వెళ్లనున్నారు. ఈసీబీ మేనేజింగ్​ డైరెక్టర్​ రాబ్​ కీతో ఐపీఎల్​ విండో పెంచడం సహా మహిళల ఐపీఎల్​ గురించి మాట్లాడనున్నారు. దీంతో పాటే మరిన్ని అంశాల గురించి చర్చించనున్నారు. బీసీసీఐకి ఈసీబీ మద్దతు ఇస్తోంది." అని సదరు అధికారి వెల్లడించారు.

గతేడాది ఐదు టెస్టుల సిరీస్​ కోసం టీమ్​ఇండియా ఇంగ్లాండ్​లో పర్యటించింది. నాలుగు టెస్టులు ముగిసేసరికి 2-1తేడాతో ఆధిక్యంలో నిలిచింది. కరోనా వల్ల ఆఖరి టెస్టును వాయిదా వేశారు. జులై 1-5 వరకు ఈ మ్యాచ్​(రీషెడ్యూల్​) జరగనుంది. దాదాపు 15ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్​ను సొంత గడ్డపై ఓడించే అవకాశం టీమ్​ఇండియా ముంగిట నిలిచింది.

ఇదీ చూడండి: 'భారత్‌, పాక్‌ ప్లేయర్స్​ తలపడాలనుకుంటున్నారు'

ABOUT THE AUTHOR

...view details