తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఏడేళ్ల తర్వాత బంగ్లా పర్యటనకు టీమ్​ఇండియా.. షెడ్యూల్​ ఇదే.. - బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్‌ హస్సన్‌

సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్​లో పర్యటించనుంది టీమ్​ఇండియా. ఇందులో భాగంగా బంగ్లాదేశ్​తో రెండు టెస్టులు, మూడు వన్డే మ్యాచ్​ల సిరీస్​లు ఆడనుంది. ఈ మేరకు ఆ దేశ క్రికెట్​ బోర్డు షెడ్యూల్​ను ప్రకటించింది.

india tour of bangladesh
india tour of bangladesh

By

Published : Oct 21, 2022, 7:56 AM IST

ఐసీసీ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి టీమ్‌ఇండియా బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. డిసెంబర్‌లో బంగ్లా వేదికగా రెండు టెస్టు మ్యాచులు, మూడు వన్డే మ్యాచుల సిరీస్‌ను నిర్వహించనున్నట్టు ఆ దేశ క్రికెట్‌ బోర్డు గురువారం వెల్లడించింది.

"గతంలో భారత్‌- బంగ్లా మధ్య జరిగిన చారిత్రక మ్యాచ్‌ గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఇరు దేశాల క్రికెట్‌ అభిమానులు మళ్లీ ఇటువంటి సందర్భం కోసం ఎదురుచూస్తున్నారు" అని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్‌ హస్సన్‌ తెలిపాడు. ఆసీస్‌ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ అనంతరం టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. నవంబర్‌ 18 నుంచి 30 వరకు 3 టీ20లు, 3 వన్డేలను అక్కడ ఆడనుంది. అనంతరం బంగ్లాలోని షేర్‌- ఇ అంతర్జాతీయ స్టేడియం వేదికగా డిసెంబర్‌ 4,7,10 తేదీలలో వన్డేలు పూర్తిచేయనుంది. చిట్టగాంగ్‌లోని జహుర్‌ అహ్మద్‌ చౌదరి మైదానంలో డిసెంబర్‌ 14-18 మధ్య మొదటి టెస్టు, ధాకాలో 22-26 మధ్య రెండో టెస్టు మ్యాచును టీమ్‌ఇండియా ఆడనుంది.

ABOUT THE AUTHOR

...view details