పురుషుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేసిన తొలిమహిళగా చరిత్ర సృష్టించారు ఆస్ట్రేలియాకు చెందిన క్లేర్ పోలోసాక్. నేడు ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్‌లో ఒమన్ - నమీబియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో క్లేర్ అంపైరింగ్ చేస్తున్నారు.
పురుషుల క్రికెట్లో... మహిళా అంపైర్ - polosok
ఆస్ట్రేలియాకు చెందిన క్లేర్ పోలోసాక్.. పురుషుల వన్డే క్రికెట్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్‌లో నేడు జరుగుతున్న మ్యాచ్‌కు అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

"పురుషుల వన్డే క్రికెట్లో అంపైరింగ్ చేయబోతున్నందుకు ఎంతో థ్రిల్‌గా ఉంది. క్రికెట్లో మహిళలు అంపైరింగ్ చేయకపోవడానికి కారణమేంటో నాకు తెలియదు. స్త్రీలలో దీనిపై అవగాహన తీసుకురావాలి" అని మ్యాచ్‌కు ముందు క్లేర్ చెప్పారు.
నవంబరు 2016లో ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మహిళల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలిసారి అంపైరింగ్ చేశారు క్లేర్. ఇప్పటివరకు 16 వన్డేల్లో... మ్యాచ్ పర్యవేక్షకురాలి బాధ్యతలు నిర్వర్తించారు. 2018 మహిళా టీ 20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్, 2017 మహిళల ప్రపంచకప్‌లోనూ అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించారు క్లేర్.