త్వరలో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో తమ జట్టు, టీమ్ఇండియాను ఓడిస్తుందని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ ధీమా వ్యక్తం చేశాడు.
పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా వెళ్లనున్న టీమ్ఇండియా.. నవంబరు 27 - జనవరి 19 మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.
ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ 2018-19లో ఆసీస్ పర్యటనకు భారత్ వెళ్లినప్పుడు లాంగర్ కోచ్‌గా ఉన్నాడు. ఆ సమయంలోనే కోహ్లీసేన టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. నిషేధం వల్ల అప్పుడు ఆడలేకపోయిన స్మిత్, వార్నర్.. ఇప్పుడు జట్టులో ఉండటం వల్ల ఆసీస్ బలంగా కనిపిస్తోంది.
నవంబరు 10న ఐపీఎల్ పూర్తయిన తర్వాతి రోజు, లీగ్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు స్వదేశానికి పయనమవుతారు. అనంతరం రెండు వారాల క్వారంటైన్లో ఉండి, భారత్‌తో మ్యాచ్‌లు ఆడతారు.
ఇవీ చదవండి: