ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ఇండియాతో రెండో వన్డేలో ఆడుతున్న డేవిడ్ వార్నర్‌కు గాయమైంది. భారత బ్యాట్స్‌మన్ ధావన్ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో ఈ దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. దీంతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు వార్నర్. తొడ కండరానికి గాయమైనట్లు ఆసీస్ జట్టు ఫిజియో చెప్పారు. స్కానింగ్ చేశాక అతడి పరిస్థితిని చెబుతామని అన్నారు.
ఆసీస్‌కు ఎదురుదెబ్బ.. రెండో వన్డేలో వార్నర్‌కు గాయం
ఆస్ట్రేలియా ఆటగాడు వార్నర్ తొడ కండరానికి గాయమైనట్లు తెలుస్తోంది. స్కానింగ్ చేశాక అతడి పరిస్థితిని వెల్లడిస్తామని ఆసీస్ జట్టు ఫిజియో చెప్పారు.
వార్నర్‌కు గాయం
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 389 పరుగుల భారీ స్కోరు చేసింది. స్మిత్ (104) మరోసారి సెంచరీతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్ (83), ఆరోన్ ఫించ్ (60), లబుషేన్ (70), మ్యాక్స్‌వెల్(63*) అద్భుత ప్రదర్శన చేశారు. భారత బౌలర్లలో షమి, బుమ్రా, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి : దంచికొట్టిన ఆస్ట్రేలియా.. టీమ్ఇండియా లక్ష్యం 390