మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. కెప్టెన్ అజింక్యా రహానె(104) అజేయ శతకంతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో అతడి ఆటతీరును ప్రశంసించాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ట్విట్టర్ వేదికగా.. జింక్స్ అద్భుతమైన ప్రదర్శన చేశాడని చెప్పాడు.
"మాకు మరో గొప్ప రోజు. ఇది ఒక అత్యున్నత టెస్టు క్రికెట్. జింక్స్ ఆటతీరు అద్భుతం" -- విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్.