ఆస్ట్రేలియాతో జరుగుతోన్న పింక్ బాల్ టెస్టులో మొదట బ్యాటింగ్ చేస్తోన్న టీమ్ఇండియా ఆచితూచి ఆడుతోంది. డిన్నర్ బ్రేక్ అనంతరం.. టీ బ్రేక్సమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.
ఆసీస్‌తో టెస్టు: టీ బ్రేక్ సమయానికి కోహ్లీ సేన 107/3 - tea break time score team india
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న పింక్ బాల్ టెస్టు మొదటి రోజు టీ బ్రేక్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది భారత్. కోహ్లీ (39), రహానే(2) క్రీజులో ఉన్నారు
టీ బ్రేక్: టీమ్ఇండియా 107/3
ఇన్నింగ్స్ రెండో బంతికి స్టార్క్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు పృథ్వీ షా. తర్వాత పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు మయాంక్ అగర్వాల్. వీరిద్దరూ రెండో వికెట్‌కు 31 పరుగులు చేశారు. భాగస్వామ్యం కుదురుకుంటున్న క్రమంలో మయాంక్ (17)ను ఔట్ చేశాడు కమిన్స్. అనంతరం పుజారా 43 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ప్రస్తుతం కోహ్లీ (39)తో కలిసి క్రీజులో ఉన్నాడు రహానే (2) . వీరిద్దరూ ఆచితూచి ఆడుతున్నారు.