తెలంగాణ

telangana

By

Published : Oct 27, 2020, 2:41 PM IST

ETV Bharat / sports

'రోహిత్​కు నిజంగానే గాయం అయిందా ?'

"ముంబయి ఇండియన్స్ కెప్టెన్​ రోహిత్​ శర్మకు నిజంగానే గాయం అయిందా ?" అని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో రోహిత్​ ప్రాక్టీస్​ చేస్తున్న ఫొటోలు వైరల్​ అవటం వల్ల ఈ వ్యాఖ్యలు చేశారు.

sunil gavaskar questions  on rohith's  injury
'రోహిత్​శర్మకు నిజంగానే గాయం అయిందా ?'

టీమ్​ఇండియా ఓపెనర్​ రోహిత్​ శర్మకు గాయం అయిందన్న వార్తల్లో కచ్చితత్వం లేదని దిగ్గజ క్రికెటర్​ సునీల్ గావస్కర్ అన్నారు. ​ ముంబయి జట్టు కోసం రోహిత్​ ప్రాక్టీస్​ చేస్తున్న ఫొటోలు వైరల్​గా మారటం వల్ల ఈ వ్యాఖ్యలు చేశారు గావస్కర్​.

" రోహిత్ ప్రాక్టీస్​ చేస్తుంటే అతనికి ఎలాంటి గాయం అయ్యిందో అర్థం కావట్లేదు. నిజంగానే అతనికి తీవ్రమైన గాయం ఉంటే అసలు బ్యాట్ పట్టుకునేవాడే కాదు. రోహిత్​కు గాయం అయ్యిందన్న వార్తల్లో కచ్చితత్వం లేదు. భారత క్రికెట్​ అభిమానుల్లో దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి."

-సునీల్​ గావస్కర్​ , భారత దిగ్గజ క్రికెటర్

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల సిరీస్​కు కేఎల్​ రాహుల్​ను వైస్ కెప్టెన్​గా నియమించింది బీసీసీఐ. రోహిత్​ శర్మ , ఇషాంత్​ శర్మల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపింది.

రోహిత్​ శర్మ లేకపోవటం వల్ల శిఖర్​ ధావన్​, మయాంక్​ అగర్వాల్​ను టీ20, వన్డే సిరీస్​కు తీసుకున్నారు. ఐపీఎల్​ ఫైనల్ తర్వాత భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తారు.

ABOUT THE AUTHOR

...view details