భారత యువ క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ ఆసీస్ ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక వెల్లడించింది. బ్రిస్బేన్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఈ సంఘటన జరిగింది. సిరాజ్‌ను "మొద్దబ్బాయి" అని ఓ ప్రేక్షకుడు అన్నట్లు సదరు పత్రిక పేర్కొంది. మూడో టెస్టులోనూ సిరాజ్‌పై చేసిన జాత్యహంకార వ్యాఖ్యల దుమారం చల్లారకముందే ఆసీస్ అభిమానులు మరోసారి అదే తీరును పునరావరృతం చేశారు.
సిడ్నీ టెస్టులో సిరాజ్‌పై ఆసీస్ వీక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేయగా, ఆటను 10 నిమిషాల పాటు నిలిపేశారు. ఆరుగురు ప్రేక్షకులను బయటకు పంపించిన తర్వాత తిరిగి ఆట మొదలు పెట్టారు. ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లపై జాత్యహంకార వ్యాఖ్యల వ్యవహారంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే క్షమాపలు చెప్పింది. ఈ విషయమై విచారణకూ ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.