భారత్,ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో టీ20కి ప్రేక్షకులు పూర్తి స్థాయిలో హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 7 నుంచి న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం కరోనా నిబంధనల్లో సడలింపు ఇవ్వడమే ఇందుకు కారణం.
కరోనా వ్యాప్తి కారణంగా వన్డే సిరీస్ మ్యాచ్లు చూసేందుకూ ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో అనుమతి లభించలేదు. కానీ, డిసెంబర్ 7న సిడ్నీ వేదికగా జరిగే చివరి టీ20కి పూర్తి స్థాయిలో ప్రేక్షకులు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం.