టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్‌శర్మ క్వారంటైన్ ముగిసింది. బుధవారం రాత్రి అతడు జట్టుతో కలిశాడు. జట్టు హోటల్‌కు చేరుకున్న అతడికి సహచరులు, కోచింగ్ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ఒకర్నొకరు హత్తుకుంటూ అభినందనలు తెలియజేసుకున్నారు. కోచ్ రవిశాస్త్రి అయితే క్వారంటైన్ తర్వాత నాజూగ్గా కనిపిస్తున్నావని పలకరించడం గమనార్హం.
ఫిట్‌నెస్ పరీక్ష నెగ్గి కొన్నిరోజుల క్రితం ఆస్ట్రేలియాకు చేరుకున్న రోహిత్‌శర్మ సిడ్నీలో క్వారంటైన్ అయ్యాడు. అక్కడ కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉండడం వల్ల ప్రవేశాలపై ఆంక్షలు ఉన్నాయి. దాంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోహిత్ 14 రోజులు రెండు గదుల భవంతిలో ఏకాంతవాసంలో ఉన్నాడు. క్వారంటైన్ ముగియడం వల్ల బుధవారం జట్టుతో అధికారికంగా కలిశాడు. ఈ సందర్భంగా జట్టు సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి రోహిత్‌ను పలకరించారు.