లాక్డౌన్ అనంతరం జరిగిన తొలి రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాతో చిత్తుగా ఓడిపోయింది భారత్. పసలేని బౌలింగ్, పేలవ ఫీల్డింగ్, నాయకత్వంలో తడబాటుతో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న కోహ్లీ సేన ఇప్పటికే వన్డే సిరీస్‌ను కంగారూలకు కోల్పోయింది. ఈ నేపథ్యంలో నామమాత్రమైన మూడో వన్డే కాన్బెర్రా వేదికగా బుధవారం జరగనుంది. ఉదయం 9.10 గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే.. మ్యాచ్ జరగనున్న మనుకా ఓవర్ మైదానంలో ఆసీస్ ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఓడిపోలేదు.
మరోవైపు.. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో 0-3తో క్లీన్‌స్వీప్‌కు గురైంది భారత్. ఆసీస్‌తో చివరిమ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి మరో క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలని చూస్తోంది.
పరువు కాపాడుకోవాలి!
తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓటమికి పేలవ బౌలింగే కారణం. ఈ నేపథ్యంలో.. మూడో వన్డేలో మార్పులు జరగొచ్చు. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న నవదీప్ సైనీ స్థానంలో శార్దుల్ ఠాకూర్ లేదా నటరాజన్‌ను తీసుకునే అవకాశాలున్నాయి.
స్పిన్నర్లు చాహల్, జడేజా కూడా వికెట్లు తీయలేకపోతున్నారు. కోహ్లీ తొందరపాటు బౌలింగ్ మార్పులు కూడా భారత్ ఓటమికి కారణమయ్యాయి. ఇప్పటికే దీనిపై మాజీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇంకా టీ-20 సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్‌లో గెలుపు భారత్‌కు తప్పనిసరి. విజయం సాధిస్తే.. పొట్టి ఫార్మాట్‌కు ఆత్మవిశ్వాసంతో సన్నద్ధం కావొచ్చు.