తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియాకు నూతన ప్రతినిధిగా కోహ్లీ! - అస్ట్రేలియా- భారత్​ల మధ్య తొలి

నూతన భారత క్రికెట్​ జట్టుకు ప్రతినిధిగా వ్యవహరించడమే తన కర్తవ్యమని కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. సవాళ్లను సానుకూలంగా మార్చుకుని ముందుకెళ్తానని అన్నాడు. టీమ్​ఇండియా - ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు గురువారమే ప్రారంభం కానుంది.

My personality is representation of new India said virat Kohli
సవాళ్లను సానుకూలాంశాలుగా మార్చుకునే జట్టు మాది:కోహ్లీ

By

Published : Dec 16, 2020, 3:45 PM IST

ఆస్ట్రేలియా- భారత్​ తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు​ టీమ్​ఇండియా సారథి కోహ్లీ. భారత​ జట్టు నూతన ప్రతినిధిగా వ్యవహరించడమే తన కర్తవ్యమని పేర్కొన్నాడు. గురువారం అడిలైడ్ వేదికగా మ్యాచ్​ ప్రారంభం కానుంది.

"ఆస్ట్రేలియన్ల మనస్తత్వంతో పోల్చుకోవాలని నేనెప్పుడూ అనుకోను. సవాళ్లను స్వీకరించి, సానుకూల దృక్పథంతో ముందుకెళ్లే టీమ్​ఇండియాకు నూతన ప్రతినిధిగా వ్యవహరించడమే నా వ్యక్తిత్వం. క్రికెట్​ ఆడేందుకు ఆస్ట్రేలియా అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ ఆడి చాలామంది ఆటగాళ్లు గౌరవం సంపాదిస్తారు. బుమ్రా అలానే పేరు తెచ్చుకున్నాడు. కానీ, మేం పేరు కంటే మంచి ప్రదర్శన చేయడంపైనే ప్రధానంగా దృష్టి పెడతాం"

-- విరాట్​ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్​

ఆసీస్​తో ప్రాక్టీసు మ్యాచ్​ల్లో జట్టుకు సారథ్యం వహించి, టీమ్​ఇండియాను గెలిపించిన రహానెపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. మిగతా మ్యాచ్​ల్లో తాను లేకపోయినా సరే కెప్టెన్సీ బాధ్యతలను రహానె అద్భుతంగా నిర్వర్తిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో మాత్రమే కోహ్లీ ఆడనున్నాడు. అనంతరం పితృత్వ సెలవుల కారణంగా స్వదేశానికి రానున్నాడు. టెస్టుల్లో అవకాశం వస్తే శుభమన్​ గిల్​ బాగా ఆడతాడని కోహ్లీ చెప్పాడు. తొలి మ్యాచ్​లో పృథ్వీ షా ఆటను చూసేందుకు ఆసక్తిగా ఉన్నానని చెప్పాడు.

ఇదీ చూడండి:విరాట్ కోహ్లీ రికార్డు.. ఆ జాబితాలో అగ్రస్థానం

ABOUT THE AUTHOR

...view details