గబ్బా టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్.. ఒకింత ఉద్వేగానికి లోనయ్యాడు. మొదటి టెస్ట్ సిరీస్‌లోనే ఐదు వికెట్లు తీయడంపై అతనికి మాటలు రాలేదు. కానీ, పిచ్‌పై ఏర్పడిన పగుళ్ల గురించి తమ బ్యాట్స్‌మెన్ జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.
ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలోనూ భారత జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసిందని సిరాజ్ పేర్కొన్నాడు. కానీ, అతడితో కలిసి ఆడే అవకాశాన్ని కోల్పోయానని అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనపై నమ్మకముంచి అవకాశమిచ్చిన కెప్టెన్ రహానేకు కృతజ్ఞతలు తెలిపాడు.
సీనియర్ బౌలర్‌ను కానప్పటికీ.. దేశవాళీ క్రికెట్, ఇండియా-ఏ తో అనుభవం ఉపయోగపడింది. జస్సీ భాయ్(జస్ప్రీత్ బుమ్రా) గైర్హాజరీతో జట్టులోకి వచ్చాను. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెంచడమే నా లక్ష్యం.
-మహమ్మద్ సిరాజ్, భారత బౌలర్.
"ఆస్ట్రేలియా గడ్డపై వరుస సిరీస్‌లు గెలిచే అవకాశం ఉన్న టీమ్ఇండియాను గాయాలు ఇబ్బంది పెట్టాయి. కీలకమైన ఆటగాళ్లు లేకున్నా జట్టు గొప్పగా పోరాడుతోంది. సిరీస్ గెలవడమే మా లక్ష్యం. శార్దూల్, సుందర్, నటరాజన్ మంచి ప్రదర్శన చేశారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. మాపై నమ్మకం ఉంచిన రహానేకు కృతజ్ఞతలు" అని అన్నాడు సిరాజ్.