టీమ్ఇండియాతో మూడో టెస్టు నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. సిడ్నీకి ప్రత్యామ్నాయంగా మెల్బోర్న్లో జరుపుతామని ప్రకటించింది. ఒకవేళ సిడ్నీలో కరోనా ఉద్ధృతి తగ్గితే తిరిగి అక్కడే నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ నెల 26న బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కానుంది.
భారత్-ఆసీస్ మూడో టెస్టుకు ప్రత్యామ్నాయ వేదిక - సిడ్నీలో కరోనా ఉద్ధృతి
సిడ్నీలో కరోనా వ్యాప్తి కొనసాగుతుండడం వల్ల భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టు నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో సిడ్నీలో కుదరకపోతే.. మెల్బోర్న్లో నిర్వహిస్తామని ఆసీస్ బోర్డు తెలిపింది.
మెల్బోర్న్ వేదికగా మూడో టెస్టు!
అయితే వేదికను మార్చేందుకు క్వీన్స్లాండ్ ప్రభుత్వం అనుమతిస్తుందో లేదో అనే విషయమై సందేహాలు ఉన్నాయి. దీనిపై క్వీన్స్లాండ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. జనవరి 7 నుంచి మూడో టెస్టు జరగనుంది. గబ్బా వేదికగా నాలుగో టెస్టును నిర్వహిస్తామని సీఏ ఇప్పటికే ప్రకటించింది.
ఇదీ చూడండి:లీగ్లో ఆడుతున్న క్రికెటర్లకు హెయిర్ కట్ కష్టమే!
Last Updated : Dec 24, 2020, 5:15 PM IST