టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే శక్తిమంతమైన క్రికెటర్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అన్నారు. కోహ్లీ దూకుడు స్వభావం గల ఆటగాడిగానే కాకుండా ఆదర్శవంతమైన క్రికెటర్‌గానూ నిలుస్తాడని పేర్కొన్నారు. తన కర్తవ్యాలను బాధ్యతగా నిర్వర్తిస్తాడని మెచ్చుకున్నారు. కోహ్లీ ఆటను చూస్తుంటే సహజసిద్ధంగా ఉంటుందని.. ఎప్పుడూ ఆటను గౌరవిస్తాడని ఆయన అన్నారు.
"క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ ఓ శక్తిమంతమైన ఆటగాడని అనుకుంటున్నా. అతను ఒక దూకుడైన క్రికెటర్గా, రాజనీతిజ్ఞుడిగా సమర్థవంతమైన పాత్రల్ని పోషిస్తాడు. గొప్ప గౌరవంతో తన బాధ్యతలను నెరవేరుస్తున్నాడని భావిస్తున్నాను. ముఖ్యంగా ఆటలో లీనమై ఉంటాడు. ఎప్పుడూ ఆటను గౌరవిస్తాడు".
-- మార్క్ టేలర్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్.