తెలంగాణ

telangana

ETV Bharat / sports

పిచ్​ను కాదు.. బలాన్ని నమ్ముకోండి: కపిల్​ దేవ్​ - కోహ్లీసేన

డేనైట్​ టెస్టు​లో ఆసిస్​ జట్టుకే విజయావకాశాలు ఎక్కవగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు భారత క్రికెట్​ జట్టు మాజీ సారథి కపిల్​ దేవ్​. ఫ్లడ్​లైట్ల​ వెలుతురులో ఎలా ఆడాలో కంగారూల జట్టుకు బాగా తెలుసు అని చెప్పారు. ఆస్ట్రేలియా పిచ్​లపై పేస్​ బలాబలాల్ని అర్థం చేసుకుని టీమ్​ఇండియా బంతులు విసరాలని సూచించారు.

kapil dev suggested that team india pacer should understand the pace strengths and weakness
పిచ్​ను కాదు.. బలాన్ని నమ్ముకోండి:కపిల్​ దేవ్​

By

Published : Dec 16, 2020, 7:51 AM IST

తమ బలబలాల్ని అర్థం చేసుకుని ఆస్ట్రేలియా పిచ్‌లపై బంతులు సంధించాలని టీమ్​ఇండియా పేసర్లకు దిగ్గజ క్రికెటర్, 1983 ప్రపంచకప్‌ విజేత కపిల్‌దేవ్ సూచించారు. తొలి డే/నైట్‌ టెస్టులో ఆస్ట్రేలియాకే విజయావకశాలు ఎక్కువగా ఉన్నాయని కపిల్‌దేవ్ అభిప్రాయపడ్డారు.

"మన ఫాస్ట్‌బౌలర్లకు ఆసీస్‌ పిచ్‌లపై ఆడిన అనుభవం ఎక్కువగా లేదు. అక్కడ బౌన్స్ లభిస్తుందని షార్ట్‌ బంతులు విసరడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే మన పేస్ బలాల్ని అర్థం చేసుకుని బౌలింగ్ చేయాలి. మనకి ప్రస్తుతం ఉత్తమ బౌలింగ్ దళం ఉంది. కానీ మన బౌలర్ల కంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లకి అక్కడి పరిస్థితులపై ఎంతో అవగాహన ఉంది. కచ్చితంగా ఆస్ట్రేలియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారు స్వదేశంలో ఆడుతున్నారు. అదే భారత్‌లో ఆడితే కోహ్లీసేన 80 శాతం విజయం సాధిస్తుందని భావిస్తా. అంతేగాక, ఆసీస్‌ ఎన్నో డే/నైట్ టెస్టులు ఆడింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు."

--కపిల్​ దేవ్​, టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​

1983లో ప్రపంచకప్‌ను ముద్దాడటం కంటే దేశం తరఫున తొలిసారి ప్రాతినిధ్యం వహించడమే తన జీవితంలో గొప్ప విషయమని కపిల్‌దేవ్‌ తెలిపారు. 'దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన తొలిరోజే నా జీవితంలో గొప్ప విషయం. ప్రపంచకప్‌ను అందుకున్న క్షణాల కంటే వెయ్యి రెట్లు గొప్పది. ఎందుకంటే దేశం కోసం ఆడాలనేది నా కల. దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఎంతో గర్వపడతా' అని అన్నారు.

1978లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన కపిల్‌దేవ్ 1983లో దేశానికి తొలి ప్రపంచకప్‌ను అందించారు. టోర్నీలో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమ్​ఇండియా ఛాంపియన్‌గా నిలిచింది. ట్రోఫీని అందుకోవడంలో సారథిగా, ఆల్‌రౌండర్‌గా‌ కపిల్‌ కీలకపాత్ర పోషించారు.

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా భారత్​, ఆస్ట్రేలియాల మధ్య గురువారం నుంచి తొలిటెస్టు ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి:పింక్​ టెస్ట్​ గురించి బోర్డర్​, గావస్కర్​ ఏమన్నారంటే..!

ABOUT THE AUTHOR

...view details