తొలి టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి కళ్లెం వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పాడు. భారీ స్కోరు చేయకుండా అతడ్ని అడ్డుకుంటామని అన్నాడు. ఉద్వేగాలను నియంత్రించుకుంటామని వివరించాడు.
"కోహ్లీ గొప్ప ఆటగాడు సహా గొప్ప నాయకుడు. అతడు అంటే చాలా గౌరవం. కానీ, అతడ్ని ఆపడానికి పక్కా ప్లాన్‌తో దిగుతాం. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా భారత్‌కు అతడు ఎంత కీలకమో మాకు తెలుసు. భారీ స్కోరు చేయకుండా అతడ్ని అడ్డుకుంటామని ఆశిస్తున్నాం. కోహ్లీని ఔట్ చేయడంపైనే దృష్టి పెడతాం. అతడ్ని కవ్విస్తామా లేదా అన్న దాని గురించి మేం మాట్లాడుకోం. అది చెత్త పని. మేం నైపుణ్యం ఆధారంగానే ఆడతాం. ఆటలో భావోద్వేగం ఉండటం సహజం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, మా ఉద్వేగాన్ని నియంత్రించుకుంటాం"