తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టు క్రికెట్​లో జెర్సీలపై పేర్లు, నంబర్లొస్తున్నాయ్.. - matches

టెస్టుల్లోనూ ఆటగాళ్ల ధరించే జెర్సీలపై పేర్లు, నంబర్లు రాబోతున్నాయి. ఆగస్టు 1 నుంచి జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్​లో ఈ విధానాన్ని తీసుకురాబోతుంది ఐసీసీ.

జెర్సీలు

By

Published : Mar 23, 2019, 6:31 AM IST

టీమిండియా కెప్టెన్ కోహ్లీ జెర్సీ నంబర్ ఎంత.. వెంటనే 18 అని చెబుతారు అభిమానులు. వన్డే, టీ 20ల్లో జెర్సీలపై పేర్లు, నంబర్లుంటాయి. కానీ టెస్టుల్లో ఉండవు. ఇకమీదట టెస్టుల్లోనూ జెర్సీపై పేర్లు నంబర్లను చూడబోతున్నాం. విరాట్​ కోహ్లీ తెలుపు జెర్సీల్లోనూ 18వ నంబరుతో కనిపించనున్నాడు. ఆగస్టు 1 నుంచి జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో జెర్సీలపై పేర్లు, నంబర్లతో బరిలో దిగనున్నారు ఆటగాళ్లు. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐసీసీ.

140 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంతవరకు జెర్సీపై పేర్లు, నంబర్లు లేవు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాలు ఇప్పటికే తమ దేశవాళీ టోర్నమెంట్లలో పేర్లు, నంబర్లున్న జెర్సీలను వాడారు . ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో వెస్టిండీస్​తో జరిగే మ్యాచ్​లో భారత ఆటగాళ్లు కూడా పేర్లున్న టీ షర్టులతో బరిలో దిగనున్నారు.

"టెస్టుల్లో ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, నంబర్లు ఉంచుతున్నాం. ఆగస్టు 1 నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో ఈ విధానం ప్రారంభమవుతుంది. టెస్టు క్రికెట్​ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం"

-- క్లేర్ ఫుర్లాంగ్, ఐసీసీ జనరల్ మేనేజర్

సచిన్ తెందుల్కర్ వన్డే జెర్సీ నంబర్ 10, మహేంద్ర సింగ్​ ధోనీ నంబర్ 7 గల జెర్సీలను టెస్టు క్రికెట్​లో వాడరని ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ సచిన్ 10వ నంబర్​ జెర్సీని ఎవరికీ కేటాయించలేదు. ధోనీ జెర్సీపై కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశముంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details