తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్విచ్‌హిట్‌తో 100 మీటర్ల సిక్స్​ అతడికే సాధ్యం! - maxiwell six

ఐపీఎల్‌-13లో పంజాబ్‌కు ఆడిన మాక్స్‌వెల్‌ ఒక్క సిక్సర్ కూడా బాధలేకపోయాడు. అయితే టీమ్‌ఇండియాతో వన్డే సిరీసులో మాత్రం భారీ సిక్సులు కొడుతూ అందర్నీ కట్టిపడేశాడు. ఆఖరి వన్డేలో రివర్స్‌స్వీప్‌లో కళ్లుచెదిరే సిక్సర్‌ బాదేశాడు. ఆ సిక్సర్​తో విధ్వంసకర వీరుడు వైరల్‌గా మారాడు.

Maxwell strikes 100 meters six with switch hit
స్విచ్‌హిట్‌తో 100 మీటర్స సిక్స్​ అతడికే సాధ్యం!

By

Published : Dec 2, 2020, 10:31 PM IST

Updated : Dec 2, 2020, 11:26 PM IST

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ ముగిసింది. 1-2 తేడాతో సిరీస్‌ను చేజార్చుకొని టీమ్‌ఇండియా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ఈ టోర్నీలో ఆసీస్‌ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడితే కోహ్లీసేన మాత్రం తడబడుతూ ముందుకు సాగింది. స్టీవ్‌స్మిత్‌ రెండు శతకాలు, డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌ అద్భుతమైన ఓపెనింగ్‌లు ఆకట్టుకున్నాయి. ఇక విధ్వంసకర వీరుడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ బాదిన సిక్సర్లు మాత్రం అందరినీ కట్టిపడేశాయి. అతడు రివర్స్‌స్వీప్‌లో బాదిన షాట్లకు విశ్లేషకులైతే ఫిదా అయిపోయారు.

ఐపీఎల్‌-13లో మాక్స్‌వెల్‌ పంజాబ్‌కు ఆడాడు. అందులో 13 మ్యాచులు ఆడినప్పటికీ ఒక్క సిక్సర్‌ బాదలేకపోయాడు. కానీ టీమ్‌ఇండియాతో వన్డే సిరీసులో మాత్రం ఆకలిగొన్న పులిలా విరుచుకుపడ్డాడు. మూడు మ్యాచుల్లో 194.19 స్ట్రైక్‌రేట్‌, 83.50 సగటుతో 167 పరుగులు సాధించాడు. అందులో 12 బౌండరీలు, 11 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన వీరుడు అతడే కావడం గమనార్హం. ఫించ్‌, స్మిత్‌, హార్దిక్‌, జడేజా తలో 6 సిక్సర్లతో అతడి తర్వాతే నిలిచారు.

కోహ్లీసేనతో జరిగిన మూడో వన్డేలో బౌలర్లను మాక్సీ బెంబేలెత్తించాడు. ఈ సిరీసుకే ప్రత్యేకంగా నిలిచిపోయే షాట్‌‌ బాదేశాడు. కుల్‌దీప్‌ వేసిన 42.3వ బంతిని మాక్సీ 100 మీటర్ల సిక్సర్‌గా మలిచాడు. అయితే దీనిని స్విచ్‌హిట్‌గా బాదడమే ప్రత్యేకత. ఆఫ్‌సైడ్‌ దూరంగా వేసిన బంతిని ఆడేందుకు మాక్సీ తన స్టాన్స్‌ను మార్చుకున్నాడు. ఇటువైపు తిరిగి రివర్స్‌స్వీప్‌‌ ద్వారా డీప్‌ పాయింట్‌ మీదుగా కళ్లుచెదిరే సిక్సర్‌ బాదేశాడు. విశ్లేషకులంతా ఈ సిరీస్‌కు ఇదే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.

ఇదీ చూడండి:'టీ-20 సిరీస్​కు ముందు గెలుపు ఉత్సాహాన్నిచ్చింది'

Last Updated : Dec 2, 2020, 11:26 PM IST

ABOUT THE AUTHOR

...view details