ఆస్ట్రేలియాతో జరగనున్నటెస్టు సిరీస్‌కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. ఇటీవలే రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు మంగళవారం.. అడిలైడ్ ఓవల్ మైదానంలో ప్రాక్టీస్ చేసింది. ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో భాగంగా.. ఒకరినొకరు తోసుకోవడం, ఎదురెదురుగా మోకాళ్లపై కూర్చోవడం, క్యాచ్‌లు పట్టడం వంటి డ్రిల్ హాస్యాస్పదంగా సాగింది.
పింక్ టెస్టుకు ముందు భారత ఆటగాళ్ల సరదా డ్రిల్ - భారత్ ఫన్నీ డ్రిల్ వీడియో
ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. గురువారం మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత జట్టు ఆటగాళ్లు సరదాగా డ్రిల్ చేశారు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది.
డే-నైట్ టెస్టుకు ముందు భారత జట్టు సరదా డ్రిల్
"నెట్ సెషన్‌కు ముందు భారత ఆటగాళ్లు ఇలా సరదాగా డ్రిల్ చేశారు" అని బీసీసీఐ ట్వీట్ చేసింది. పింక్ బాల్ టెస్టుకు ముందు ఆటగాళ్లలో ఒత్తిడి తగ్గించేందుకు ఈ విధంగా చేసినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి:'జట్టు తుది కూర్పుపై నిర్ణయం తీసుకోలేదు'
Last Updated : Dec 16, 2020, 10:31 AM IST