తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్​లో టీమ్​ఇండియా ప్రదర్శనపై మాజీల హర్షం - ian chapel comments on ongoing test series

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు​ సిరీస్​లో భారత ప్రదర్శనపై క్రికెట్​ మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సిరీస్​ మొత్తం భారత్​ గొప్పగా ఆడుతోందని ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ మైకెల్​ వాన్​ కితాబిచ్చాడు. ఇరు జట్ల బ్యాటింగ్​ లైనప్​ బలంగా ఉందని.. అందుకే సిరీస్​ ఆసక్తికరంగా సాగుతోందని ఆసీస్​ మాజీ ఆటగాడు ఇయాన్​ ఛాపెల్​ పేర్కొన్నాడు.

ind-vs-aus-visitors-have-shown-great-character-says-vaughan
ఆసీస్​లో టీమిండియా ప్రదర్శనపై మాజీల హర్షం

By

Published : Jan 17, 2021, 2:04 PM IST

Updated : Jan 17, 2021, 2:48 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగు టెస్టుల సిరీస్​లో భారత్​ గొప్ప పోరాట పటిమ చూపుతోందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్​ మైకేల్​​ వాన్​ ప్రశంసించాడు. బ్రిస్బేన్​లోని గబ్బా స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో భారత లోయర్​ ఆర్డర్​ బ్యాట్స్​మన్​ రాణించడంపై వాన్​ ఈ వ్యాఖ్యలు చేశాడు.

186 పరుగుల వద్ద ఆరో వికెట్​ రూపంలో ప్రధాన బ్యాట్స్​మన్లను టీమిండియా కోల్పోయింది. అరంగేట్ర ఆటగాడు వాషింగ్టన్​ సుందర్​, బౌలర్​ శార్దుల్​ ఠాకూర్​లు వీరోచితంగా రాణించి జట్టును తిరిగి గాడిలో పడేశారని వాన్​ తెలిపాడు.

"సిరీస్​ ఆద్యంతం భారత్​ గొప్ప ప్రదర్శన చేసింది. చాలా మంది ఆటగాళ్లు గాయపడినప్పటికీ.. రిజర్వ్​ బెంచ్​ బలంగా ఉంది." అని మైకేల్​ వాన్​ ట్వీట్​ చేశాడు.

రసవత్తరంగా సిరీస్​..

భారత్​, ఆస్ట్రేలియా జట్లు బలమైన బ్యాటింగ్​ లైనప్​లు కలిగి ఉండడం వల్ల టెస్ట్​ సిరీస్​ రసవత్తరంగా సాగుతోందని.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ ఇయాన్​ ఛాపెల్​ అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం 1-1తో సిరీస్​ సమమైందని.. నాలుగో టెస్ట్ ఫలితం కోసం చూస్తున్నానని తెలిపాడు. ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ కోసం ఇరుజట్లు ఫైనల్​ చేరితే.. ఐసీసీ టైటిల్​లోనూ పోరు బాగుంటుందని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:శార్దుల్​, సుందర్ అర్ధసెంచరీలు- భారత్​ 336 ఆలౌట్​

Last Updated : Jan 17, 2021, 2:48 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details