టీమ్‌ఇండియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. భోజన విరామ సమయానికి ఆ జట్టు స్కోర్ 65/2గా నమోదైంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(1), మార్కస్ హారిస్(5) విఫలమయ్యారు. 17 పరుగులకే వారిద్దరూ ఔటయ్యారు.
బ్రిస్బేన్ టెస్టు: లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 65/2 - Ind vs Aus Brisbane Test live updates
బ్రిస్బేన్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు తొలి సెషల్లో రెండు వికెట్లు నష్టపోయి 65 పరుగులను నమోదు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మార్కస్ హారిస్ విఫలమయ్యారు. టీమ్ఇండియా బౌలర్లు సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ సాధించారు.
బ్రిస్బేన్ టెస్టు: లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 65/2
ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే సిరాజ్.. వార్నర్‌ను ఔట్‌చేసి టీమ్‌ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. స్లిప్‌లో రోహిత్ చేతికి చిక్కడం వల్ల ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. కాసేపటికే శార్దూల్ ఠాకుర్ బౌలింగ్‌లో హారిస్ ఔటయ్యాడు. ఆపై జోడీ కట్టిన స్మిత్(30*), లబుషేన్(19*) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. దీంతో తొలి సెషన్ పూర్తయ్యేసరికి జట్టు 65/2తో నిలిచింది. వీరిద్దరూ ఇప్పటివరకు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.