తెలంగాణ

telangana

ETV Bharat / sports

నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియా.. లబుషేన్​ సెంచరీ

బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్​మెన్​ దూకుడుగా ఆడుతున్నారు. అద్భుతమైన బ్యాటింగ్​తో మార్నస్​ లబుషేన్ సెంచరీ సాధించాడు.

By

Published : Jan 15, 2021, 11:15 AM IST

Updated : Jan 15, 2021, 11:37 AM IST

Ind vs Aus 4th test live updates: marnus labuschagne century
నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియా.. లబుషేన్​ సెంచరీ

టీమ్‌ఇండియాతో ఆడుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా దూకుడుగా ఆడుతోంది. అద్బుతమైన బ్యాటింగ్​తో మార్నస్​ లబుషేన్​ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. ప్రస్తుతం క్రీజ్​లో మార్నస్​ లబుషేన్​ (101*: 195 బంతుల్లో), వేడ్​ (43*: 85 బంతుల్లో) ఉన్నారు.

తొలి ఇన్నింగ్స్​లో 63 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. 65/2తో రెండో సెషన్ కొనసాగించిన ఆస్ట్రేలియా కాసేపటికే జట్టు స్కోర్‌ 87 పరుగుల వద్ద స్టీవ్‌స్మిత్‌(36; 77 బంతుల్లో 5x4) వికెట్‌ కోల్పోయింది. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో రోహిత్‌ క్యాచ్‌ అందుకోవడం వల్ల స్మిత్‌ పెవిలియన్‌ చేరాడు.

అంతకుముందు లబుషేన్‌ అర్ధశతకం సాధించడానికి ముందే రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తొలుత రహానె అతడి క్యాచ్‌ వదలగా, తర్వాత స్లిప్‌లో పుజారా మరోసారి అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే మాథ్యూవేడ్‌తో కలిసి లబుషేన్‌ సెంచరీతో కొనసాగుతున్నాడు.

ఇదీ చూడండి:బ్రిస్బేన్​ టెస్టు: గాయంతో మైదానాన్ని వీడిన సైనీ

Last Updated : Jan 15, 2021, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details