మెల్బోర్న్లో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ 'రనౌట్' విషయమై షేన్ వార్న్ సహ పలువురు మాజీలు తప్పుపడుతున్నారు. తొలిరోజు ఆటలో క్రీజులైన్పై పైన్ బ్యాట్ పెట్టడం, భారత కీపర్ పంత్ వికెట్లను గ్లౌజ్‌తో తాకడం దాదాపు ఒకేసారి జరిగాయి. బ్యాట్ క్రీజులైన్ లోపల ఉందని భావించిన థర్డ్ అంపైర్ పైన్ నాటౌట్ అని ప్రకటించాడు. అయితే ఈ నిర్ణయంతో షాకయ్యానని ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ చెప్పాడు.
"సమీక్షలో టిమ్ పైన్‌ను రనౌట్‌గా ప్రకటించకపోవడం ఆశ్చర్యకరం. నేను చాలా క్షుణ్ణంగా పరిశీలించాను. క్రీజ్ లైన్‌ను బ్యాట్ దాటలేదనే అనుకుంటున్నా. నా ఉద్దేశంలో అతడు ఔట్"
-- షేన్ వార్న్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు
పైన్‌ను ఔట్ ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు భారత మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.