లాక్డౌన్ తర్వాత ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్లో ఓడిన టీమ్ఇండియా.. అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగబోయే రెండో వన్డేలో గెలిచి సిరీస్ను సమం చేయాలని భావిస్తోంది. ఈ పోరులో గెలిచి తమ గెలుపును కొనసాగించాలని ఆసీస్ చూస్తోంది. మరి ఎవరు నెగ్గుతారో?
ప్రతీకారం తీర్చుకుంటుందా?
ఆసీస్తో తొలి వన్డేలో 66 పరుగులు తేడాతో ఓడిపోయింది టీమ్ఇండియా. హార్దిక్ పాండ్య(90), ధావన్(74) మినహా అందరూ విఫలమైపోయారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఆటగాళ్లు తేలిపోయారు. బౌలర్లలో షమి(3) ఒక్కడే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. జట్టులోని మిగతా ఆటగాళ్లు తమ ఆటను మెరుగుపరుచుకుని సమష్టిగా రాణిస్తేనే గెలిచే అవకాశముంది. లేదంటే సిరీస్పై ఆశలు వదులుకోవడమే!
గెలుపు కొనసాగిస్తారా?