తెలంగాణ

telangana

ETV Bharat / sports

'హార్దిక్​ ఆట చూసి మ్యాచ్​ గెలుస్తామనుకున్నా.. కానీ'

హార్దిక్​ పాండ్య ఆటతీరు చూసి ఆస్ట్రేలియాపై చివరి టీ20 గెలుస్తామని భావించినట్లు తెలిపాడు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ. ప్రాక్టీస్​ మ్యాచ్​ ఆడేది లేనిది ఆలోచించి చెబుతానన్నాడు.

VIRAT
'హార్దిక్​ ఆటతీరు చూసి మ్యాచ్​ గెలుస్తామని భావించా!'

By

Published : Dec 8, 2020, 8:37 PM IST

Updated : Dec 8, 2020, 9:57 PM IST

ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య ఆటతీరు చూసి చివరి టీ20 మ్యాచ్​ కూడా గెలుస్తామని భావించానని భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. సిరీస్ గెలుపుతో ఈ ఏడాదిని ముగించడం ఆనందంగా ఉందని తెలిపాడు. రానున్న టెస్టు సిరీస్​పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రాక్టీస్​ మ్యాచ్​ ఆడేది లేనిది తర్వాత నిర్ణయం తీసుకుంటానని మ్యాచ్​ అనంతరం వెల్లడించాడు.

"రానున్న మాచ్​ల్లో ఆసీస్​కు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ప్రస్తుత కొవిడ్​ పరిస్థితుల్లో కూడా అభిమానులు మైదానాల్లోకి వచ్చి జట్టుకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చారు. తర్వాత జరగనున్న టెస్టు సిరీస్​ను ఛాలెంజింగ్​గా తీసుకుంటాం. ప్రస్తుతం భారత జట్టు మునుపటికంటే దృఢంగా ఉంది."

-విరాట్ కోహ్లీ, భారత జట్టు కెప్టెన్.

మూడో టీ20 మ్యాచ్​లో ఆస్ట్రేలియా 12 పరుగుల తేడాతో భారత్​పై గెలిచింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆసీస్ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్.. ఈ సిరీస్​ చాలా గొప్పగా అనిపించిందని అన్నాడు.

"మొదటి రెండు మ్యాచ్​లు ఓడిపోవాల్సింది కాదు. ఈసారి మా జట్టులో ఇద్దరు లెగ్​స్పిన్నర్లు ఉన్నారు. స్వెప్సన్​ 7వ ఓవర్లో ధావన్​, కోహ్లీలకు చక్కగా బౌలింగ్ చేశాడు. జంపా కూడా ప్రతిభ కనబరిచాడు. గత 18 నెలల నుంచి మేం పరిమిత ఓవర్ల మ్యాచ్​ల్లో బాగా రాణిస్తున్నాం".

-ఆరోన్ ఫించ్, ఆస్ట్రేలియా కెప్టెన్​.

ఇదీ చదవండి:ఆస్ట్రేలియాదే చివరి మ్యాచ్​.. సిరీస్​ మాత్రం భారత్​దే

Last Updated : Dec 8, 2020, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details