భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌కు సమయం దగ్గరపడుతోంది. గత పర్యటనలో విజయం సాధించిన కోహ్లీసేన.. దానిని కొనసాగించాలని చూస్తుండగా, ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కంగారూలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్. అతడంటే నచ్చకపోయినా అతడి బ్యాటింగ్ స్టైల్‌ను ఇష్టపడతామని అన్నాడు. విరాట్ లాంటి ఆటగాడు బరిలోకి దిగతున్నాడంటే ప్రత్యర్థి జట్టుకు జాగ్రత్తగా ఉంటుందని చెప్పాడు.
"కోహ్లీతో పెద్ద సంబంధాలేం లేవు. టాస్ వేసినప్పుడు మాత్రమే చూశాను. అతడితో మాకు ఏ ఇబ్బంది లేదు. ఇంకో సరదా విషయం ఏంటంటే.. అతడు నచ్చకపోవచ్చు కానీ, ఓ అభిమానిగా విరాట్ బ్యాటింగ్ స్టైల్‌ను ఇష్టపడతాను. గత పర్యటనలో మేమిద్దరం గొడవపడ్డాం. ఆ స్థానంలో ఎవరు ఉన్నా అలానే జరిగి ఉండేది. సత్తా ఉన్న ఆటగాడు బరిలోకి దిగుతున్నాడంటే ఎవరైనా జాగ్రత్తగా ఉంటారు"
-- టిమ్ పైన్, ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్