తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆసీస్​ పేలవ బ్యాటింగ్​ భారత్​కు బలమవ్వాలి' - Gambhir wants India to win the test series

ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్​ పేలవంగా ఉందని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అలాగే భారత్​ సిరీస్​ నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Gambhir wants India to win the test series
'ఆసీస్​ పేలవ బ్యాటింగ్​ భారత్​కు బలమవ్వాలి'

By

Published : Jan 6, 2021, 9:00 PM IST

ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్​ పేలవంగా ఉందని టీమ్ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న టెస్టు సిరీస్​లో ఆసీస్ ప్రదర్శనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. ఇదే చనువుగా భారత్​ ఉత్తమ బ్యాటింగ్​ చేసి సిరీస్​ నెగ్గాలని ఆశించాడు.

గౌతమ్ గంభీర్

"ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గే అవకాశం భారత్​కు ఉంది. టాప్​-4 బ్యాట్స్​మన్​ను పరిగణలోకి తీసుకుంటే ఆసీస్​ బ్యాటింగ్​ లైనప్ సరిగ్గా లేదని స్పష్టంగా అర్ధమవుతోంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ఆస్ట్రేలియా కన్నా దృఢంగా ఉన్నాయి."

-గౌతమ్ గంభీర్, భారత మాజీ క్రికెటర్

ఆసీస్​ బ్యాటింగ్​ చాలా బలహీనంగా ఉందని గంభీర్​ తెలిపాడు. ఇదివరకెప్పుడూ ఆసీస్​ బ్యాటింగ్​ లైనప్​ ఇంత బలహీనంగా ఉండటం తను చూడలేదని పేర్కొన్నాడు. షమీ, ఇషాంత్, ఉమేశ్ జట్టులో ఉంటే ప్రత్యర్థి జట్టుకు మరింత ఇబ్బంది కలిగేదని వ్యాఖ్యానించాడు. ఆసీస్ గడ్డపై ఆ దేశ జట్టునే ఓడించేందుకు ఇది భారత్​కు మంచి అవకాశమని వెల్లడించాడు.

ఇదీ చదవండి:చరిత్ర సృష్టించిన ఆసీస్ మహిళా అంపైర్

ABOUT THE AUTHOR

...view details